వివిధ వర్గాల ప్రజల ధర్నాలతో కలెక్టరేట్ సోమవారం దద్దరిల్లింది. సమస్యల పరిష్కారంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, ప్రజా సంక్షేమ పథకాలు మంజూరు చేయాలని, భూ సమస్యలకు పరిష్కారం చూపాలని, పల్లెలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పింఛన్లు, రేషన్‌కార్డులు మంజూరు చేయాలని విన్నవించారు. పీజీఆర్‌ఎస్ లో జిల్లాస్థాయి అధికారులకు వినతులు అందజేశారు. సమస్యలపై గోడు వినిపించారు. – విజయనగరం గంటస్తంభం
● మురుగునీటితో నిత్యనరకం
సమస్యను వివరించేందుకు
కలెక్టరేట్‌కు వస్తున్న దివ్యాంగుడు
కొత్తవలస మండల కేంద్రంలో సర్వే నంబర్ 168,173 భూముల్లో ఇళ్ల పట్టాలిచ్చి ఏళ్లు గడుస్తున్నాయే తప్ప స్థలాలు చూపలేదంటూ లబ్ధిదారులు ఆవేదన వ్యక్తంచేశారు. ఇళ్ల స్థలాల కేటాయింపులో రాజకీయ వివక్ష తగదన్నారు. అలమండ హుద్‌హుద్ కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సమితి కార్యవర్గ సభ్యుడు డేగల అప్పలరాజు, ఇళ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు.
జామి మండలం భీమసింగి పంచాయతీ పరిధిలోని కె.భీమసింగి గ్రామం రాజావీధిలో మురుగునీరు ప్రవహిస్తోంది... కాలువల్లో పూడికలు తీసి మురుగునీటి కష్టాలు తీర్చాలని మండల స్థాయి అధికారులకు విన్నవించినా స్పందించడంలేదంటూ గ్రామస్తులు ఆందోళన చేశారు. జేసీ సేతుమాధవన్‌కు వినతిపత్రం అందజేశారు. తక్షణమే మురుగునీటి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తిచేశారు.


