గ్రామ రూపురేఖలు మారాలి | - | Sakshi
Sakshi News home page

గ్రామ రూపురేఖలు మారాలి

Apr 14 2026 8:46 AM | Updated on Apr 14 2026 8:46 AM

బలిజిపేట: ఫైలేరియా గ్రామంగా పేరుబడిన పెదపెంకి గ్రామం రూపురేఖలు మార్చాలని పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌ వైశాలి అధికారులకు సూచించారు. పెదపెంకి గ్రామాన్ని ఆమె సోమవారం పర్యవేక్షించారు. గ్రామంలో ఇంతవరకు జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించారు. జరగాల్సిన పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలలని, మురుగునీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో డ్వామా పీడీ రామచంద్రరావు, ఎంపీడీఓ శ్రీవాణి, అధికారులు పాల్గొన్నారు.

సబ్‌ కలెక్టర్‌ వైశాలి

Advertisement
 
Advertisement
Advertisement