రైతన్న ‘రుణం’ తీర్చుకోని.. చంద్రబాబు సర్కారు | - | Sakshi
Sakshi News home page

రైతన్న ‘రుణం’ తీర్చుకోని.. చంద్రబాబు సర్కారు

Apr 14 2026 8:46 AM | Updated on Apr 14 2026 8:46 AM

జిల్లాలో 2లక్షల హెక్టార్లకు పైగా పంటల సాగవుతున్నాయి. వరి, చెరకు, మొక్కజొన్న, గోగు, నువ్వులు, పెసర, మినుము, కంది, చోడి, కొర్ర, సామ వంటి పంటలు సాగువుతున్నాయి. ఉద్యాన పంటలైన మామిడి, జీడిమామిడి, సపోట, అరటి, పామాయిల్‌, బొప్పాయి, డ్రాగన్‌ ఫ్రూట్‌, కూరగాయలు, ఆకుకూరలు కూడా పండిస్తున్నారు. రైతులకు ఖరీఫ్‌ 2025–26లో పంట రుణాల లక్ష్యం రూ.3,525.148 కోట్లు కాగా 2,06,809 మంది రైతులకు 3,194.53 కోట్లు రుణాలు ఇచ్చారు. రూ.330.518 కోట్లు రుణాలు ఇవ్వలేక పోయారు. జిల్లాలో 4.45 లక్షల మంది వరకు రైతులు ఉంటే 2.06 లక్షల మంది రైతులకు మాత్రమే రుణాలు ఇచ్చారు. సాగు పెట్టుబడికి డబ్బులు అందక రైతులు వడ్డీలకు అప్పులు తెచ్చి పంట పెట్టుబడి పెడుతున్నారు. తీరా పంట చేతికొచ్చినా మద్దతు ధర అందడం లేదు. తక్కువ ధరకే దళారులకు విక్రయించడంతో పెట్టుబడి కోసం తీసుకున్న అప్పు వడ్డీతో చెల్లిస్తే రైతులకు ఏమీ మిగలడం లేదని రైతులు వాపోతున్నారు. 2025–26 ఖరీఫ్‌ సీజన్‌లో బ్యాంకుల నుంచి రూ.3,194 .63 కోట్లు రుణాలు మాత్రమే అందించినట్టు జిల్లా వ్యవసాయాధికారి వి.టి.రామారావు తెలిపారు.

విజయనగరం ఫోర్ట్‌:

రైతు సంక్షేమంపై చంద్రబాబు ప్రభుత్వం కినుకవహిస్తోంది. సాగుకు కనీసం సహకరించడంలేదంటూ రైతన్నలు గగ్గోలు పెడుతున్నా పట్టించుకోవడం లేదు. అన్నదాత సుఖీభవ కింద పెట్టుబడి సాయం సరిగా అందని పరిస్థితి. విత్తనాల నుంచి యంత్రసాయం వరకు అరకొరే. ఎరువుల కోసం బారులు తీరాల్సిన దుస్థితి. రుణాల మంజూరులోనూ లక్ష్యం చేరుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. పంట రుణాలు పూర్తిస్థాయిలో ఇవ్వక పోవడంతో అన్నదాతలు ప్రైవేటు వ్యాపారుల నుంచి వడ్డీకి అప్పులు చేసి పంటల సాగుకు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి.

ఇదీ

పరిస్థితి..

2025–26 ఖరీఫ్‌ పంట రుణాల లక్ష్యం రూ.3,525.148 కోట్లు

జిల్లాలో రైతుల సంఖ్య 4.45లక్షలు

రుణాలు అందినది కేవలం

2.06 లక్షల మందికి

రూ.330.518 కోట్లు మంజూరు చేయని పరిస్థితి

అప్పుచేసి పంటల సాగు

పంటల విక్రయంలో లభించని మద్దతు ధర– ఆవేదనలో అన్నదాత

Advertisement
 
Advertisement
Advertisement