● శాసనమండలి విపక్షనేత
బొత్స సత్యనారాయణ
పూసపాటిరేగ: ప్రజల్లోకి చంద్రబాబు ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనను తీసుకెళ్లాలని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పూసపాటిరేగ మండలం రెల్లివలస గ్రామంలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమానికి నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడుతో కలిసి బొత్స సత్యనారాయణ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలుచేస్తున్న అరకొర సంక్షేమ పథకాలు సైతం అర్హులకు అందడం లేదని, దీనిపై అర్హుల తరఫున పోరాడాలని సూచించారు. రెండేళ్లవుతున్నా జిల్లాలో ఒక్కరికీ కూడా కొత్తపింఛన్ మంజూరుచేయకపోవడం విచారకరమన్నారు. బడుగు బలహీన వర్గాలకు 50 ఏళ్లకే పింఛన్ అంటూ ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ ఏమైందని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలన్నారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో మండలాల వారీగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో సమావేశాన్ని త్వరలో ఏర్పాటు చేయాలని నాయకులకు సూచించారు. పార్టీ శ్రేణులకు ఎటువంటి సమస్యలు ఎదురైనా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం కార్యకర్తలతో విడివిడిగా మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకొన్నారు. సమావేశంలో పార్టీ పూసపాటిరేగ మండలాధ్యక్షుడు పతివాడ అప్పలనాయు డు, నాయకులు అంబళ్ల శ్రీరాములు నాయుడు, బొత్స సందీప్, బొత్స చైతన్యబాబు, మహంతి శ్రీనివాసరావు, జనార్దనరావు, టొంపల సీతారాం, కొత్తకోట శ్రీరాములు, దాడిశెట్టి త్రినాథరావు, గుజ్జు సురేష్‌రెడ్డి, గొర్లె రమణ, పిన్నింటి ఎల్లంనాయుడు, ఎం.కె.మోహన్, గాబు సూరప్పన్నరెడ్డి, మహంతి లక్ష్మణరావు, పతివాడ గోపి, మలుకుర్తి శ్రీనివాసరావు, గొర్లె రమా, డి.ఈశ్వరరావు, జనపాల అప్పారావు, పడాల శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.


