విజయనగరం టౌన్: సినీనటి శ్రీలీల ఆదివారం సాయంత్రం జిల్లా కేంద్రంలో సందడి చేశారు. స్థానిక వైఎస్సార్ కూడలి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన కళ్యాణ్ జ్యూవెలర్స్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఆమె హాజరయ్యారు. వందలాది మంది అభిమానులను చూసి ఆమె తన్మయత్వానికి లోనయ్యారు. తన అభిమానులందరికీ రుణపడి ఉంటామన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగానే తన పాత్రలు ఉంటాయన్నారు. భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలలో నటించి అందరికీ దగ్గరవుతామన్నారు. కళ్యాణ్ జ్యూవెలర్స్ వంటి బ్రాండ్‌తో అనుబంధం ఏర్పడ డం తనకు దక్కిన గౌరవమన్నారు. కళ్యాణ్ జ్యూవెలర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ కల్యాణ్ రామన్ మాట్లాడుతూ విజయనగరంలో వినియోగదారుల విభిన్నమైన అవసరాలను షోరూమ్ ద్వారా తీర్చడమే తమ సంస్ధ లక్ష్యమన్నారు. అనంతరం అభిమానులతో సెల్ఫీలు దిగారు.


