నివాళులు.. | - | Sakshi
Sakshi News home page

నివాళులు..

Apr 13 2026 7:50 AM | Updated on Apr 13 2026 7:50 AM

విజయనగరం క్రైమ్‌ : జిల్లా నేర సమీక్ష విభాగంలో (డీసీఆర్బీ) హెడ్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న ఎ. జగదీశ్వరరావు (49) గుండెపోటుతో ఆదివారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మృతుని కుటుంబ సభ్యులకు ప్యూనరల్‌ ఖర్చులు, ఫ్లాగ్‌ ఫండ్‌ అందజేశారు. జగదీశ్వరరావుకు 11వ తేదీ రాత్రి గుండెపోటు రాగా కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఎస్పీ వెంట డీఎస్పీ ఆర్‌.గోవిందరావు, సీఐలు కె.కుమారస్వామి, ఆర్‌వీఆర్‌కే చౌదరి, సీహెచ్‌ సూరిదేముడు, బి.లక్ష్మణరావు, పోలీస్‌ అసోసియేషన్‌ కె. శ్రీనివాసరావు, తదితరులున్నారు.

ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌లో పట్టణ యువకుడి ప్రతిభ

విజయనగరం అర్బన్‌: కఠిన శ్రమ, పట్టుదలతో ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని పట్టణానికి చెందిన యువకుడు చిప్పాడ రవిప్రసాద్‌ నిరూపించారు. ఇటీవల విడుదలైన ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ (స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌) ఫలితాల్లో ఆయన ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ సూపరింటిండెంట్‌గా ఎంపికయ్యాడు. పట్టణంలోని సీబీ కాలనీకి చెందిన రవిప్రసాద్‌ మొదటి ప్రయత్నంలోనే ఈ ఉద్యోగాన్ని సాధించడం విశేషం. బీటెక్‌ పూర్తి చేసిన అనంతరం ప్రభుత్వ రంగంలో పని చేయాలనే లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా చదివానని రవిప్రసాద్‌ తెలిపారు. ఇతని తండ్రి ప్రభుదాస్‌ జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖలో సహాయ సంబంధాల అధికారిగా పనిచేస్తున్నారు.

విద్యుదాఘాతంతో వ్యక్తి

మృతి

బలిజిపేట: మండలంలోని పెదపెంకిలో విద్యుదాఘాతంతో ఒకరు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన మజ్జి శంకరరావు (60) ప్రైవేట్‌ ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తుంటాడు. గ్రామంలోని సచివాలయానికి విద్యుత్‌ సరఫరా లేదని చెప్పడంతో మరమ్మతులకు ఆదివారం వెళ్లాడు. మరమ్మతులు చేపడుతుండగా..విద్యుత్‌షాక్‌తో ఒక్కసారిగా కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సబ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement