డాక్టర్‌ నీలిమకు సత్కారం | - | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ నీలిమకు సత్కారం

Apr 12 2026 2:24 AM | Updated on Apr 12 2026 2:24 AM

డాక్టర్‌ నీలిమకు సత్కారం

విజయనగరం అర్బన్‌: ఐక్యరాజ్య సమితికి చెందిన వరల్డ్‌ ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూపీఓ) నిర్వహణలోని ‘వరల్డ్‌ ఐపీ డే–2026’ అంతర్జాతీయ వీడియో పోటీల టాప్‌–20లో స్థానం సాధించిన భారతదేశానికి చెందిన డాక్టర్‌ నీలిమను సీతం కళాశాల యాజమాన్యం స్థానిక జేఎన్‌టీయూ జీవీలో శనివారం ఘనంగా సత్కరించింది. ప్రపంచ వ్యాప్తంగా 43 దేశాల నుంచి మొత్తం 182 వీడియోలు పోటీలో పాల్గొనగా భారతదేశం నుంచి ఎంపికై న ‘కలరిపయట్టు’ అనే ఏకై క వీడియో కావడం విశేషమని జేఎన్‌టీయూ జీవీ వీసీ ప్రొఫెసర్‌ వీవీసుబ్బారావు కొనియాడారు. భారతదేశపు ప్రాచీన యుద్ధకళను మోధో సంపత్తి హక్కుల ద్వారా ఎలా పరిరక్షించుకోవచ్చో ఈ వీడియోలో డాక్టర్‌ నీలిమ వివరించారు. ఈ పోటీలో తుది విజేతను ప్రజల ఓటింగ్‌ ద్వారా నిర్ణయించనున్నారని, ప్రతి ఒక్కరూ గరిష్టంగా ఐదు ఓట్లు వేయవచ్చునని, ఓటింగ్‌కు ఈ నెల 19వ తేదీ వరకు గడువు ఉందన్నారు. కార్యక్రమంలో రిజస్ట్రార్‌ ప్రొఫెసర్‌ డి.రాజ్యలక్ష్మి, సీతం కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.శశిభూషణరావు, కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ డీవీ రాంమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement