ప్రెస్‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు ఫిర్యాదు చేస్తాం | - | Sakshi
Sakshi News home page

ప్రెస్‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు ఫిర్యాదు చేస్తాం

Apr 9 2026 8:17 AM | Updated on Apr 9 2026 8:17 AM

కలెక్టరేట్‌ కూడలిలో ఆంధ్రజ్యోతి

దినపత్రిక ప్రతులు దహనం

విజయనగరం: మావిగన్‌ రాజధాని ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌ చానల్‌లో రాధాకృష్ణ రాసిన, ప్రసారం చేసిన బూతు రాతలు, రోత వాఖ్యలపై అంబేడ్కర్‌ రైట్స్‌ ఫోరం ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్‌ కార్యాలయం కూడలిలో ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రతులను బుధవారం దహనం చేశారు. ఈ సందర్భంగా అంబేడ్కర్‌ రైట్స్‌ ఫోరం ప్రతినిధులు బుంగ భానుమూర్తి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ కుటుంబాలకు చెందిన మహిళలపై రాధాకృష్ణ రాతలు, వాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయంటూ మండిపడ్డారు. ఆ పత్రిక, చానల్‌ యజమాని తీరును ఖండిస్తున్నామమన్నారు. సంస్థపై ప్రెస్‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు ఫిర్యాదు చేస్తామన్నారు. దళిత క్రైస్తవుల అంశంపై సుప్రీంకోర్టు తీర్పును కూడా వక్రీకరిస్తూ, వారిని భయపెట్టే పదాలను వినియోగించడం దారుణమన్నారు. కార్యక్రమంలో అంబేడ్కర్‌ రైట్స్‌ ఫోరమ్‌ ప్రతినిధులు దారాన వెంకటేష్‌, లోపింటి రామకృష్ణ, నిమ్మకాయల సుగుణాకర్‌, జై భీమ్‌ భారత్‌ పార్టీ జిల్లా ఇన్‌చార్జి చింతపల్లి దుర్గారావు, బుక అంజిబాబు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement