టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును తొలగించాలంటూ చీపురుపల్లి నియోజకవర్గంలోని గరివిడిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ క్యాంప్ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి పాలకొండ మెయిన్ రోడ్డులోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తిరుమల పవిత్రతను కాపాడడంలో చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని ఖండించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.


