అయ్యా.. ఆ దుకాణాలే మా బతుకులు | - | Sakshi
Sakshi News home page

అయ్యా.. ఆ దుకాణాలే మా బతుకులు

Apr 5 2026 9:24 AM | Updated on Apr 5 2026 9:24 AM

అయ్యా.. 50 ఏళ్లుగా ఆ దుకాణాలే మా బతుకులు... వాటిపై వచ్చిన ఆదాయంతోనే జీవనం సాగిస్తున్నాం... ఇప్పుడు వాటిని తొలగిస్తే మా బతుకులు రోడ్డున పడతాయంటూ పలువురు మహిళలు కన్నీరుపెట్టారు. రామభద్రపురం మండలం ఆరికతోట కూడలిలో జాతీయ రహదారి పక్కన ఏర్పాటుచేసిన దుకాణాలు తొలగించవద్దంటూ అధికారులను వేడుకున్నారు. తన భూమికి దుకాణాలు అడ్డుగా ఉన్నాయంటూ ఓ వ్యక్తి కలెక్టర్‌కు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు శనివారం మండల ప్రత్యేకాధికారి ప్రశాంత్‌కుమార్‌, తహసీల్దార్‌ అజూరఫిజాన్‌లు జాతీయ రహదారి అధికారులతో కలిసి దుకాణాల తొలగింపులో భాగంగా రోడ్డుపై మార్కింగ్‌ ఇచ్చారు. దుకాణాలు తీసేయాలని సూచించడంతో దుకాణదారులు గగ్గోలుపెట్టారు.

– రామభద్రపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement