టీటీడీ చైర్మన్‌ను పదవి నుంచి తొలగించాలంటూ మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు, నాయకులు గజపతినగరంలో ఆందోళన చేశారు. వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి నిరసన ర్యాలీ చేపట్టారు. తిరుమల పవిత్రతను కాపాడాలంటూ వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్‌నాయుడును విధుల నుంచి తొలగించకుండా వత్తాసు పలుకుతున్న చంద్రబాబు తీరు సిగ్గుచేటుగా ఉందన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు రౌతు రాజేశ్వరి, గార తౌడు, వర్రి నరసింహమూర్తి పాల్గొన్నారు.


