బాడంగి: రక్షణశాఖలో 17ఏళ్ల పాటు సేవలందించి మార్చి 31న ఉద్యోగ విరమణ చేసిన సైనికుడికి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు.మండలంలోని అచ్చియ్యపేటకు చెందిన లచ్చుపతుల ప్రవీణ్‌కుమార్ అస్సాంలోని మిలటరీ బెటాలియన్‌లో సిగ్నల్ టెక్నీషియన్‌గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. గురువారం ఆయన గ్రామానికి వస్తున్నారని తెలుసుకున్న గ్రామస్తులు,యువత మండల కేంద్రం బాడంగి వచ్చి పూలమాలలు వేసి స్వాగతించారు.ప్రోటోకాల్ ప్రకారం తహసీల్దార్ వరప్రసాద్, ఎస్‌ఐ తారకేశ్వరరావు అక్కడికి చేరుకొని జాతీయ జెండా ఎగురవేసి స్వాగతం పలికారు. అక్కడి నుంచి గ్రామస్తులు ప్రవీణ్‌కుమార్‌ని గ్రామానికి ప్రత్యేక వ్యాన్‌పై మెయిన్‌రోడ్డు మీదుగా ఊరేగిస్తూ అచ్చియ్యపేటకు తోడ్కొనివెళ్లారు. గ్రామంలో సభ ఏర్పాటుచేసి సన్మానించారు. ప్రవీణ్‌కుమార్ గతంలో జమ్ముకశ్మీర్ బూటాన్,హైదరాబాద్, తదితర ప్రదేశాల్లో పనిచేశారు.


