విజయనగరం క్రైమ్ : ఎల్.కోట – మళ్లివీడు రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని మృతదేహాన్ని జీఆర్పీ పోలీసులు గురువారం గుర్తించారు. దీనికి సంబంధించి జీఆర్పీ హెచ్‌సీ ప్రసాద్ ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. సుమారు 50 నుంచీ 55ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి మృతదేహాన్ని మళ్లివీడు రైల్వేస్టేషన్ వద్ద గుర్తించామన్నారు. సదరు మృతదేహం సుమారు 5 అడుగుల 6 అంగుళాల పొడవు, చామన ఛాయ రంగుతో ఉందన్నారు. సదరు మృతదేహంపై లేత వైలెట్ రంగు ఫుల్ హాండ్స్ షర్టు, కాఖీ కలర్ ప్యాంటు ధరించి ఉందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు. ఆచూకీ తెలిస్తే 9247585742, 9440170317 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు.


