జామి: తల్లి చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉంటూ పదో తరగతి పరీక్షలకు హాజరు కావాల్సి వచ్చింది ఓ విద్యార్థికి. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని భీమసింగి పంచాయతీ పీతలపాలెం గ్రామానికి చెందిన బొట్ట వెంకటేష్ జామి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం రాత్రి వెంకటేష్ తల్లి దేముడమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. ఏం చేయాలో తెలియని పుట్టెడు దుఃఖంలో కూడా వెంకటేష్ గురువారం జరిగిన ఇంగ్లిష్ పరీక్షకు హాజరయ్యాడు.


