‘సీతం’లో పాలిసెట్‌ ఉచిత శిక్షణ | - | Sakshi
Sakshi News home page

‘సీతం’లో పాలిసెట్‌ ఉచిత శిక్షణ

Apr 3 2026 7:08 AM | Updated on Apr 3 2026 7:08 AM

‘సీతం’లో పాలిసెట్‌ ఉచిత శిక్షణ

విజయనగరం అర్బన్‌: గాజులరేగ పరిధిలోని సీతం కళాశాలలో పాలిసెట్‌ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఉచిత శిక్షణను ప్రారంభిస్తున్నట్టు సత్య విద్యా సంస్థల కరెస్పాండెంట్‌, మాజీ ఎంపీ డాక్టర్‌ బొత్స ఝాన్సీలక్ష్మి అన్నారు. ఈ నెల 4 నుంచి 24వ తేదీ వరకు ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. ఇటీవల 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్ధులకు ఈ కోచింగ్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఉచిత కోచింగ్‌తో పాటు స్టడీ మెటీరియల్స్‌, బాలురు, బాలికలకు హాస్టల్‌ సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతి రోజూ ప్రాక్టీస్‌ టెస్ట్‌ల ద్వారా విద్యార్థులకు మెరుగైన సన్నద్దత కల్పించనున్నట్లు చెప్పారు. అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంతో శిక్షణ అందిస్తామని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం పాలిసెట్‌ కోచింగ్‌కు సంబంధించిన బ్రోచర్‌ను విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం 9533545689, 7989040214 నంబర్లను సంప్రదించాలని ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ డీవీ రామమూర్తి సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement