అంగన్‌వాడీల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీల ఆందోళన

Apr 1 2026 8:30 AM | Updated on Apr 1 2026 8:30 AM

విజయనగరం ఫోర్ట్‌: అంగన్‌వాడీలకు తక్షణమే వేతనాలు పెంచాలని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ అధ్యక్ష కార్యదర్శులు సునీత, ప్రభావతి డిమాండ్‌ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం అర్బన్‌ ఐసీడీఎఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో సమ్మె చేస్తున్న సమయంలో కూటమి నేతలు వచ్చి తొందరలోనే మన ప్రభుత్వం వస్తుందని, సమస్యలు పరిష్కరిస్తుందని చెప్పి ఇప్పుడు మాయమాటలు చెబుతున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు సర్కార్‌ వచ్చి 20 నెలలైనా వేతనాలు పెంచలేదన్నారు. పదోన్నతుల విషయంలో రాజకీయ జోక్యం సరికాదన్నారు. యూనియన్‌ నాయకులు బి.పైడిరాజు, చిట్టితల్లి, సత్యవతి, రత్నం, కరుణ, జయ, రమ, పద్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement