విజయనగరం ఫోర్ట్: జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఆస్పత్రుల భవనాలను వెంటనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ, ఇంజినీరింగ్ అధికారులతో మంగళవారం సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో నిర్మాణంలో ఉన్న భోగాపురం, ఎస్.కోట, నెల్లిమర్ల, బాడంగి, బొబ్బిలి, రాజాం ఆస్పత్రుల భవనాల పెండింగ్ పనులను తక్షణమే పూర్తి చేయాలన్నారు. మెడికల్ ఎక్విప్‌మెంట్, అగ్నిమాపక పరికరాలు, ఏసీలు ఏర్పాటు, అంతర్గత రోడ్లు, జనరేటర్లు ఏర్పాటు, పేషేంట్లు వేచి ఉండే గదులు, ఫర్నిచర్, ప్రహరీ, పెయింటింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జేసే సేతుమాధవన్, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ పద్మశ్రీరాణి తదితరులు పాల్గొన్నారు.


