పుచ్చ... | - | Sakshi
Sakshi News home page

పుచ్చ...

Apr 1 2026 8:30 AM | Updated on Apr 1 2026 8:30 AM

ఆరోగ్యానికి భలే రక్ష

సీజనల్‌ వ్యాపారం

మూడు నెలలు పాటు ఈ పుచ్చకాయల వ్యాపారం ఉంటుంది. ఈ ప్రాంతంతో పాటు ఇతర జిల్లాల నుంచి పుచ్చకాయలను దిగుమతి చేసుకొంటున్నాం. ధర అందరికీ అందుబాటులో ఉంటుంది. ఎండ సమయంలో ఇవి ముక్కలుగా కోసి ఉంచితే అమ్ముడైపోతాయి.

– పి.శ్రీనివాసరావు, వ్యాపారి, పార్వతీపురం

పార్వతీపురం: ఎండలు మండిపోతున్నాయి. ఉదయం పది దాటితే చాలు వేడి గాలులు. అత్యవసర ప్రయాణాలు చేసే ప్రయాణికులతో పాటు విద్యార్థులు, ఉద్యోగులకు తప్పని పాట్లు. ఈ సమయంలో దారి పొడవునా నేనున్నానంటూ అటు దాహార్తిని, ఇటు ఆకలిని తీర్చేస్తుంది పుచ్చకాయ. సాధారణ వ్యక్తి కూడా కొనుగోలు చేసి తినగలిగే దివ్య ఫలంగా పుచ్చకాయ అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంది. ప్రధానంగా ఈ వేసవిలో పుచ్చకాయ కనిపిస్తే చాలు తినని మనిషి, రుచి చూడని జిహ్వ ఉండదు. జిల్లాలోని కొమరాడ, జియ్యమ్మవలస, పాలకొండ, సీతంపేట, గరుగుబిల్లి, వీరఘట్టం, భామిని తదితర మండలాలలో సుమారు 300 ఎకరాలలో కర్బూజా పంటను రైతులు సాగు చేస్తున్నారు. గతంలో పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి తదితర జిల్లాలకే పరిమితమైన ఈ పంట ఇప్పుడు అన్ని ప్రాంతాలలో సాగు చేస్తున్నారు. అయితే ఈ పంట సాగు చేసిన రైతులకంటే వ్యాపారులకే లాభసాటిగా ఉంటుందని రైతులంటున్నారు.

శుభ కార్యక్రమాలలో..

పుచ్చకాయ అంటే ఇష్టపడని వారుండరు. చిన్నవారి నుంచి వృద్ధుల వరకూ ప్రతీ ఒక్కరు పుచ్చకాయని తింటారు. ఇప్పుడు కొత్తగా వివాహాలు, శుభ కార్యక్రమాలు జరిగిన సందర్భంలోనూ, తమ ఇండ్ల వద్ద నిర్వహించే ఫంక్షన్‌లలో పుచ్చకాయలను ముక్కలుగా కోసి వచ్చేవారికి ఇస్తున్నారు. ప్రతీ ఒక్కరి ఇళ్లలో ఈ వేసవిలో పుచ్చకాయలు నిల్వ ఉంచుకుంటున్నారు.

వేసవిలో దాహార్తి తీర్చే దివ్య ఫలం

కిలో రూ.25లు ధరలో లభ్యం

దారి పొడవునా విక్రయాలు

ఇతర ప్రాంతాల నుంచి దిగుమతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement