డ్యూటీ డాక్టర్‌ గైర్హాజరుపై కలెక్టర్‌ సీరియస్‌ | - | Sakshi
Sakshi News home page

డ్యూటీ డాక్టర్‌ గైర్హాజరుపై కలెక్టర్‌ సీరియస్‌

Apr 1 2026 8:24 AM | Updated on Apr 1 2026 8:24 AM

డెంకాడ: డెంకాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధుల్లో ఉండాల్సిన డాక్టర్‌ గైర్హాజరు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీహెచ్‌సీ వైద్యులు ఇద్దరిలో ఎం.శివరామకృష్ణ ఎఫ్‌పీ క్యాంప్‌కు వెళ్లగా, విధుల్లో ఉండాల్సిన మరో డాక్టర్‌ ఎన్‌.అనూష లంచ్‌కు వెళ్లారని సిబ్బంది వివరణ ఇవ్వడాన్ని తీవ్రంగా పరిగణించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారికి ఫోన్‌చేసి డాక్టర్‌కు షోకాజ్‌ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. ఓపీ రిజిస్టర్‌, మందుల స్టాక్‌ రూమ్‌ను పరిశీలించారు.

ఐరన్‌ మాత్రలతో రక్తహీనత నివారణ

● డీఎంహెచ్‌ఓ జీవనరాణి

విజయనగరం ఫోర్ట్‌: గర్భిణుల్లో రక్తహీనత నివారణకు ఐరన్‌ మాత్రలు అందజేయాలని డీఎంహెచ్‌ఓ ఎస్‌.జీవనరాణి వైద్యసిబ్బందికి సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం మాతా,శిశు మరణాల నివారణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భవిష్యత్తులో మాతాశిశు మరణాలు సంభవించకుండా చర్యలు చేపట్టాలన్నారు. హైరిస్క్‌ గర్భణులు ప్రసవమయ్యేవరకు పర్యవేక్షణ చేయాలన్నారు. విధుల్లో అలసత్వం చూపే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో డీఐఓ ఆర్‌.అచ్చుతకుమారి, వైద్యులు దీపక్‌ కుమార్‌, సంధ్య, తదితరులు పాల్గొన్నారు.

జూన్‌ లోపు గృహ నిర్మాణాలు పూర్తి చేయాలి

కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌రెడ్డి

విజయనగరం అర్బన్‌: గృహ నిర్మాణాలను ఈ ఏడాది జూన్‌ నెలాఖరులోగా పూర్తిచేయాలని కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గృహనిర్మాణాల ప్రగతిపై హౌసింగ్‌ అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీఓలతో కలెక్టరేట్‌ నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. జిల్లాలోని వివిధ లేఅవుట్లలో 16,316 ఇళ్లు, సొంత స్థలాల్లో వ్యక్తిగతంగా మంజూరైన మరో 3,161 ఇళ్ల నిర్మాణాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. టిడ్కో కాలనీలకు మౌలిక సదుపాయాల కల్పనలో జాప్యంచేయొద్దన్నారు. సమావేశంలో హౌసింగ్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ మురళీమోహన్‌, వివిధ మండలాల ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు, ఇంజినీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement