ఏపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శిగా అప్పలనాయుడు | - | Sakshi
Sakshi News home page

ఏపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శిగా అప్పలనాయుడు

Mar 30 2026 7:21 AM | Updated on Mar 30 2026 7:21 AM

ఏపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శిగా అప్పలనాయుడు

పార్వతీపురం రూరల్‌: ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యా య ఫెడరేషన్‌ (ఏపీటీఎఫ్‌) పార్వతీపురం మన్యం జిల్లా ప్రధాన కార్యదర్శిగా రావాడ అప్పలనాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం స్థానిక పెన్షనర్స్‌ భవనంలో మహే ష్‌ అధ్యక్షతన జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర కార్యద ర్శి నల్లా బాలకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంతవరకు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న నల్లా బాలకృష్ణ ఇటీవల రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. దీంతో ఖాళీ అయిన ఆ స్థానంలో అప్పలనాయుడును నియమించారు. ఈ ఎన్నిక ప్రక్రియకు రాష్ట్ర కార్యదర్శి ధవళ సరస్వ తి పరిశీలకురాలిగా వ్యవహరించారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ.. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కా రం కోసం అన్ని మండల శాఖలను సమన్వ యం చేసుకుంటూ పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు, వివిధ మండలాల ప్రతినిధులు పాల్గొన్నారు.

పిచ్చికుక్క దాడిలో ఇద్దరికి గాయాలు

కురుపాం: మండల కేంద్రంలో పిచ్చికుక్క స్వైరవిహారం చేయడంతో ఇద్దరు గాయపడిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రానికి చెందిన గౌడు సాయి కుటుంబ సభ్యులతో కలిసి నూకాలమ్మ గుడికి వెళ్లారు. వారు పూజలో ఉండగా.. ఓ పిచ్చికుక్క వచ్చి చిన్నారి ఉత్తేజ్‌పై దాడి చేయడగా కంటిపై గాయాలయ్యాయి. వెంటనే చిన్నారిని తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అలాగే శివ్వన్నపేటకు చెందిన ప్రసాద్‌ అనే యువకుడిపై కూడా పిచ్చికుక్క దాడి చేసి గాయపరిచింది. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు.

నిత్యాన్నదానానికి

రూ. లక్ష వితరణ

పాలకొండ రూరల్‌: పట్టణంలోని సత్యసాయి సేవా మందిరం ద్వారా కొనసాగుతున్న నిత్యాన్నదాన పథకానికి పట్టణానికి చెందిన విజయదుర్గ హోటల్‌ యజమాని కొత్తకోట ప్రసాదరావు (బుల్లి), సులోచన దంపతులు ఆ దివారం రూ. లక్ష వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ.. సేవలు మరింత మెరుగ్గా అందించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సమితి కన్వీనర్‌ ఆర్‌.కిశోర్‌, సభ్యులు పాల్గొన్నారు.

మాజీ సైనికుల సర్వసభ్య సమావేశం

శ్రీకాకుళం కల్చరల్‌: నగరంలోని పెద్ద రెల్లివీధిలో జిల్లా మాజీ సైనికుల సమాఖ్య సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం నిర్వహించినట్లు జిల్లా అధ్యక్షుడు కటకం పూర్ణచంద్రరావు తెలియజేశారు. సభను కోశాధికారి ఎం.సింహాచలం ఫెడరేషన్‌ జమా ఖర్చుల వివరాలతో ప్రారంభించారు. జనరల్‌ సెక్రటరీ పైడి మురళీధరరావు మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు చేపట్టిన పనులను వివరించారు. అనంతరం అధ్యక్షుడు పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ఇటీవల కార్గిల్‌ పార్క్‌ను శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించి జిల్లాలోని సైనికుల్లో స్ఫూర్తిని నింపడంపై నాయకులు, అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో జనరల్‌ సెక్రటరీ పైడి మురళీధరరావు, అసిస్టెంట్‌ జనరల్‌ సెక్రటరీ ఎస్‌.రామకృష్ణ, కోశాధికారి ఎం.సింహాచలం, గౌరవ ప్రెసిడెంట్లు తమ్మినేని కృష్ణారావు, టి.కృష్ణారావు, ఎస్‌.ఎల్‌.రావు, మహిళా సెక్రటరీలు కె.జగ్గమ్మ, డి.భారతి, అడ్వైజర్లు ఎ.వి.జగన్‌మోహన్‌రావు, పి.రామారావు, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లు పి.జమున, మెట్ట ఈశ్వరమ్మ, డి.రత్నమాల, బి.రాంబాబు, డి.వాసుదేవరావు, ఎన్‌.లక్ష్మీ నారాయణ, ఎం.రాములు, పి.శ్రీనివాసరావు, పి.చిన్నారావు, ఎం.నాగభూషణరావు, ఎస్‌.అప్పలసూరి, కె.రాజశేఖర్‌, వి.గౌరిశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement