ప్రస్తుత వేసవిలో ఉష్ణోగ్రతల పెరుగుదలతో పాటు విద్యుత్ వినియోగం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపడుతున్నాం. వినియోగదారులకు అంతరాయం లేకుండా అవసరానికి సరిపడేలా సరఫరాను అందించే దిశగా ప్రణాళికలు రూపొందించాం. కొద్ది రోజుల వ్యవధిలోనే 9 ఎంయూ నుంచి 9.5 ఎంయూ మేర విద్యుత్ వినియోగం పెరిగింది. రానున్న రోజుల్లో ఈ పెరుగుల 10 ఎంయూకు దాటే అవకాశం ఉంది. వ్యవసాయ విద్యుత్ సర్వీసుల ట్రాన్స్‌ఫార్మర్‌లు పాడైతే తక్షణమే మార్చేందుకు 150 ట్రాన్స్‌ఫార్మర్లు సిద్ధంగా ఉన్నాయి. ఎల్‌నినో ప్రభావంతో ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిసినా తక్షణమే నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు అవసరమైన సామగ్రి సిద్ధంగా ఉంది.
– మువ్వల లక్ష్మణరావు,
ఎస్‌ఈ, ఏపీఈపీడీసీఎల్, విజయనగరం ఆపరేషన్ సర్కిల్


