వెటర్నరీ కళాశాల అసోసియేట్‌ డీన్‌గా ధనలక్ష్మి | - | Sakshi
Sakshi News home page

వెటర్నరీ కళాశాల అసోసియేట్‌ డీన్‌గా ధనలక్ష్మి

Mar 29 2026 6:46 AM | Updated on Mar 29 2026 6:46 AM

చీపురుపల్లిరూరల్‌(గరివిడి): గరివిడి శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ కళాశాల అసోసియేట్‌ డీన్‌గా తిరుపతి వేంకటేశ్వర వెటర్నరీ కళాశాలలో క్లినికల్‌ హెడ్‌గా విధులు నిర్వహించిన డా.ఎన్‌.ధనలక్ష్మి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఆమె ఇక్కడకు ఉద్యోగోన్నతిపై బదిలీ అయ్యారు. ఇక్కడ అసోసియేట్‌ డీన్‌గా విధులు నిర్వహించిన డాక్టర్‌ మక్కేన శ్రీను గన్నవరం వెటర్నరీ కళాశాల క్లినికల్‌ హెడ్‌ ఆఫ్‌ డిపార్ట్‌మెంట్‌కు బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో డీన్‌ ధనలక్ష్మి మాట్లాడుతూ కళాశాల అభివృద్ధికి తనవంతు తోడ్పాటు అందిస్తానని చెప్పారు. విద్యార్థులు చదువులో ఉత్తమంగా రాణించి ఉద్యోగ అవకాశాలు అందుకునేలా బోధన అందించడమే లక్ష్యమన్నారు.

ఆర్టీఈ ఉచిత ప్రవేశాల

లక్కీడ్రా ఫలితాలు విడుదల

డీఈఓ యు.మాణిక్యంనాయుడు

విజయనగరం అర్బన్‌: జిల్లాలోని ప్రైవేటు ఆన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం (ఆర్‌టీఈ) కింద 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఉచిత సీట్ల ప్రవేశాల తొలివిడత లక్కీ డ్రా (లాటరీ) ఫలితాలను జిల్లా విద్యాశాఖాధికారి, సమగ్ర శిక్ష ఏపీసీ యు.మాణిక్యంనాయుడు శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఈ పథకం కింద ప్రవేశాల కోసం మొత్తం 3,305 మంది విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారన్నారు. తొలివిడత లాటరీ ప్రక్రియలో 1,503 మంది విద్యార్థులు ఎంపికయ్యారన్నారు. వీరికి జిల్లాలోని 240 ప్రైవేటు ఆన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో ప్రవేశాలు కల్పిస్తామని చెప్పారు. విద్యాహక్కుచట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో మొత్తం సీట్లలో 25 శాతం సీట్లు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు కేటాయించినట్లు తెలిపారు. ఎంపికై న విద్యార్థులు మార్చి 26 నుంచి ఏప్రిల్‌ 7 వరకు తమ ప్రవేశాలను ఖరారు చేసుకోవాలని సూచించారు.

బంగారు కుటుంబాల వేడుకలు రేపు

పార్వతీపురం: పార్వతీపురం పట్టణంలోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో బంగారు కుటుంబాలకు ఏడాది పూర్తి అయిన సందర్భంగా సోమవారం సంబరాలను నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకరరెడ్డి శనివారం పేర్కొన్నారు. జిల్లాలోని ఎంపీడీఓలతో టెలీ కాన్ఫరెన్సులో మాట్లాడారు. మండల, నియో జకవర్గ స్థాయిలో సంబరాల్లో పాల్గొనేలా ఆహ్వానించాలన్నారు. ముఖ్యమంత్రి వర్చువల్‌గా ముఖాముఖి చర్చించే అవకాశం ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement