అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన పీడీ | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన పీడీ

Mar 29 2026 6:50 AM | Updated on Mar 29 2026 6:50 AM

తెర్లాం: మండలంలోని కూనాయవలస గ్రామంలో మినీ అంగన్‌వాడీ కేంద్రాన్ని ఐసీడీఎస్‌ జిల్లా పీడీ బాలామణి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రంలో కార్యకర్త, ప్రీ స్కూల్‌ పిల్లల హాజరు, స్టాక్‌ వివరాలు, రికార్డులను పరిశీలించారు. అనంతరం పీడీ మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాలను సక్రమంగా నిర్వహించాలన్నారు. కార్యకర్తలు, హెల్పర్లు సమయపాలన పాటించాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు సంబంధించిన అన్ని రికార్డులను ఆఫ్‌లైన్‌లోను, ఆన్‌లైన్‌లోను ఎటువంటి లోపాలు లేకుండా సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ప్రీ స్కూల్‌ పిల్లలకు ఆటపాటలతో కూడిన విద్యను నేర్పించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణలో లోపాలుంటే చర్యలు తీసుకొనేందుకు వెనుకాడేది లేదని పీడీ హెచ్చరించారు. ఆమెతో పాటు పంచాయతీ కార్యదర్శి, అంగన్‌వాడీ కార్యకర్తలు, లబ్ధిదారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement