● కొన్ని చోట్ల దుకాణాలను క్లినిక్‌లుగా మార్చేస్తున్న వైనం
● ఆపరేషన్లు మినహా మిగిలిన వైద్యసేవలు చేసేస్తున్నారు..
ల్సిన వారు ఎటువంటి అనుమతులు లేకుండా గుట్టుగా వైద్యం చేసేస్తున్నారు. డాక్టర్ చీటి ప్రకారం మందులు ఇవ్వాల్సిన వారు డాక్టర్ అవతారం ఎత్తుతున్నారు. మెడికల్ షాపులే చిన్న తరహా క్లినిక్‌లు మాదిరి మారిపోతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలిసీ తెలియని వైద్యం చేయడం వల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
విజయనగరం ఫోర్ట్: జిల్లాలోని అనేక చోట్ల మందుల దుకాణాల్లో ఆయా నిర్వాహకులే చిన్నచిన్న రోగాలకు తమకు తెలిసిన మందులు ఇచ్చి వైద్యం చేస్తూ దందా సాగిస్తున్నట్టు తెలుస్తుంది. మెడికల్ షాపుల పేరిట నడుస్తున్న వైద్యం రోజురోజుకు పెరుగుతుంది. మందులు మాత్రమే విక్రయించా


