సాలూరు: శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి సోదరుడు, సీనియర్ అడ్వకేట్ కోలగట్ల తమ్మన్నశెట్టి మృతి బాధాకరమని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. గురువారం విజయనగరం వెళ్లి తమ్మన్నశెట్టి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రాజన్నదొర వెంట కోట ఈశ్వరరావు, కోలగట్ల గోపి, బలభద్రుని శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.
60 రకాల వంటకాలతో రాములోరి సారె
వేపాడ: మండల కేంద్రంలో సీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా మహిళలు తయారు చేసిన 60 రకాల వంటకాల సారెను గురువారం రాత్రి ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. శుక్రవారం జరగనున్న సీతారాముల కల్యాణోత్సవానికి ముందుగా సారెను ఆలయానికి తీసుకువెళ్లినట్టు మహిళా భక్తులు తెలిపారు. శుక్రవారం కల్యాణోత్సవంతో పాటు అన్న సమారాధన నిర్వహించనున్నట్టు సభ్యులు తెలిపారు.


