చిన్నారి ధన్షిక ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

చిన్నారి ధన్షిక ప్రతిభ

Mar 27 2026 9:50 AM | Updated on Mar 27 2026 9:50 AM

చిన్నారి ధన్షిక ప్రతిభ

22 నెలల్లో మూడు అంతర్జాతీయ

సంస్థల గుర్తింపు

బొబ్బిలి రూరల్‌: మండలంలోని కొత్తపెంట గ్రామానికి చెందిన సిరికి లక్ష్మునాయుడు, హారికల కుమార్తె ధన్షిక పుట్టిన 22 నెలల్లో అరుదైన అంతర్జాతీయ ఘనత సాధించింది. 5 నెలల ప్రాయంలో 120 ఫ్లాష్‌ గుర్తించడంతో గతంలో నోబెల్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డును సొంతం చేసుకోగా, ప్రస్తుతం 22నెలల వయస్సులో మరో రెండు అవార్డులను సాధించింది. ఆల్ఫాబెట్స్‌, వాటికి సంబంధించిన పదాలు, అంకెలు, వారాల పేర్లు, నెలల పేర్లు, శరీర భాగాలు, జాతీయ చిహ్నాలు, శ్లోకాలతో పాటు తెలుగు–ఇంగ్లిష్‌ రైమ్స్‌ స్పష్టంగా పలుకుతూ అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఈ చిన్నారి అద్భుతమైన జ్ఞాపకశక్తిని గుర్తించిన ప్రతి ష్టాత్మక ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డు, ఇన్స్‌ఫ్ల్యూన్స్‌ర్‌ వరల్డ్‌ రికార్డులను వరించాయి. చిన్నారి ధన్షిక ప్రతిభను వీడియోల రూపంలో సంబంధిత సంస్థల నిర్వాహకులు పంపగా బుధవారం ప్రశంసాపత్రాలు, మెడల్స్‌ను పంపి అభినందించారు. రెండేళ్లు కూడా నిండని అతి పిన్న వయసులోనే మూడు రికార్డుల్లో చోటు దక్కించుకోవడం పట్ల చిచ్చర పిడుగు ధన్షికను కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement