బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయాలి : కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయాలి : కలెక్టర్‌

Mar 26 2026 7:18 AM | Updated on Mar 26 2026 7:18 AM

బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయాలి : కలెక్టర్‌

పార్వతీపురం: ఎక్కడైనా బాల్య వివాహాలు చేస్తే వారిపట్ల కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్‌ డా. ఎన్‌.ప్రభాకరరెడ్డి హెచ్చరించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో బాల్య వివాహాల నిర్మూలనపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అవగాహన కల్పించేందుకు జాగృతులను చేయాలని, ప్రత్యేక అవగాహన సదస్సులను నిర్వహించాలన్నారు. బాల్య వివాహాలు జరుగుతున్నట్లు ఎవరికై నా తెలిస్తే 1098, 181 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.

డ్రగ్స్‌, గంజాయి వినియోగంపై ఉక్కుపాదం

మాదక ద్రవ్యాలు, మత్తు పదార్ధాల వినియోగంపై ఉక్కుపాదం మోపాలని కలెక్టర్‌ డా. ఎన్‌.ప్రభాకరరెడ్డి పోలీసు శాఖను ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటి సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాల రవాణా నివారణకు పోలీస్‌, ఫారెస్టు, ఎకై ్సజ్‌ శాఖలతో జాయింట్‌ ఆపరేషన్‌ నిర్వహించాలన్నారు. గంజాయి వినియోగించిన, విక్రయించినా బైండోవర్‌ కేసులు నమోదు చేయాలన్నారు. సమావేశంలో ఎస్పీ ఎస్‌వీ మాధవ్‌ రెడ్డి, సబ్‌కలెక్టర్‌ ఆర్‌.వైశాలి, ఎడిషనల్‌ ఎస్పీ వి.మనీషారెడ్డి, జిల్లా రవాణాధికారి టి.దుర్గా ప్రసాద్‌, జిల్లా ప్రజారావాణాధికారి శ్రీనివాసరావు, తదితరులున్నారు.

సీఎస్‌సీ పనులు పూర్తి కావాలి

జిల్లాలోని కమ్యూనిటీ శానిటరీ కాంప్టెక్‌ (సీఎస్‌సీ) పనులు సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్‌ ప్రభాకరరెడ్డి అధికారులకు ఆదేశించారు. బుధవారం ఆర్‌డబ్ల్యూఎస్‌, ఇంజనీరింగ్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. రోజువారీ ప్రగతి నివేదికలను వివరించాలన్నారు. ఇంతవరకు పూర్తి చేసిన పనులకు సంబంఽధించి బిల్లులను ఆన్‌లైన్‌లో పొందుపరచాలన్నారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement