రాష్ట్ర స్థాయి బాక్సింగ్‌ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి బాక్సింగ్‌ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

Mar 26 2026 7:18 AM | Updated on Mar 26 2026 7:18 AM

రాష్ట్ర స్థాయి బాక్సింగ్‌ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

విజయనగర అర్బన్‌: ఆంధ్రప్రదేశ్‌ బాక్సింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని స్వర్ణభారతి స్టేడియంలో ఈ నెల 23, 24 తేదీల్లో నిర్వహించిన 7వ రాష్ట్ర స్థాయి బాక్సింగ్‌ పోటీల్లో స్థానిక నేషనల్‌ స్కూల్‌ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. జూనియర్‌ బాలుర విభాగంలో 70–75 కిలోల కేటగిరీలో బి.సచిన్‌ బంగారు పతకం సాధించగా, 54–57 కిలోల కేటగిరీలో డి.కార్తీక్‌ రజత పతకం గెలుచుకున్నారు. బి.సచిన్‌ ఏప్రిల్‌ మొదటి వారంలో నాగపూర్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్రం తరఫున పాల్గొననున్నారు. విద్యార్థుల విజయాలను పురస్కరించుకుని నేషనల్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌, ప్రిన్సిపాల్‌ బి.రామారావు, డైరెక్టర్‌ డా. ఎం.ఎ.ఎన్‌. వెంకటరావు, ఉపాధ్యాయ సిబ్బంది అభినందనలు తెలిపారు. జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. విజేతలను పీఈటీ మహేష్‌, శ్రీనివాస్‌ సేవలను వారు ప్రత్యేకంగా కొనియాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement