● పాఠశాలల్లో వంట తంటా..
విజయనగరం గంటస్తంభం:
ఇంధన కొరత పెట్టిన ‘మంట’.. ఇంకా చల్లారడం లేదు. పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ పరిస్థితుల వల్ల గ్యాస్, డీజిల్ వినియోగంపై ప్రభా వం చూపిస్తోంది. ప్రధానంగా గ్యాస్ సమయానికి లభించకపోవడం.. మున్ముందు దొరుకుతుందో లేదోనన్న భయంతో కొందరు బ్లాక్ చేస్తున్నారు. దీనివల్ల సిలిండర్ల కోసం ఇటు ప్రజలు, అటు హోటళ్ల వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. కొద్దిరోజుల ముందు వరకు బుక్ చేసిన రోజుల వ్యవధిలోనే సిలిండర్ ఇంటికి వచ్చేది. ఇప్పుడు రోజుల తరబడి రావడం లేదు. గ్యాస్ ఏజెన్సీ వారు 45 రోజుల సమయం పడుతుందని అంటున్నారు. మరో దారిలేక, గతం మాదిరి ప్రజలు గ్యాస్ గోదాముల వద్దకు పరుగులు తీస్తున్నారు.
● జిల్లాలో గ్యాస్ కొరత ప్రజల జీవితాలను తీవ్ర ప్రభావితం చేస్తోంది. 15 గ్యాస్ ఏజెన్సీల నుంచి 1.20 లక్షల మంది వినియోగదారులకు గ్యాస్ సరఫరాలో అంతరాయం కలుగుతోంది. బుక్ చేసినా సిలిండర్ సమయానికి రాకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందురు బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు.
● హోటళ్లలో కట్టెల పొయ్యిలు..
గ్యాస్ కొరతతో చిన్న హోటళ్లు మూతపడుతుండగా.. మరికొన్ని కట్టెల పొయ్యిలతోనే కొనసాగుతున్నాయి. కమర్షియల్ సిలిండర్లు దొరకక పెద్ద రెస్టారెంట్లు కూడా ఆరుబయట కట్టెలతో వంటలు చేస్తున్నారు. సాధారణంగా రూ.1000కు లభించే సిలిండర్ ఇప్పుడు రూ.1500– రూ.2,000కు చేరడంతో వ్యాపారులపై అ‘ధనపు’భారం పడుతోంది. ఇదే అదునుగా టీ, టిఫిన్‌లపై రూ.10 నుంచి రూ.20 వరకు అదనపు వసూళ్లు చేస్తున్నారు. కొన్నిచోట్ల గృహవినియోగ సిలిండర్లలోని గ్యాస్‌ను కమర్షియల్ సిలిండర్లలోకి మార్చుతున్నారు. గ్యాస్‌కొరతతో పలు చోట్ల టిఫిన్ సెంటర్లు మూసివేశారు.
గ్యాస్ కష్టాలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులనూ తాకాయి. జిల్లాలో సుమారు 1715 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అలమవుతోంది. గ్యాస్ కనెక్షన్లు ఉన్న పాఠశాలల్లో వంటకు తంటాలు తప్పడం లేదు. గ్యాస్ సకాలంలో సరఫరా కాకపోవడంతో కట్టెలపొయ్యిపై వంటలు చేసేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.
గ్యాస్ కొరతతో కట్టేలే కల్పవృక్షం
చిరువ్యాపారుల నుంచి పాఠశాలల వరకు తప్పని వంట తిప్పలు
సిలిండర్ కోసం క్యూలు.. హోటళ్లలో పొగలు
మధ్యాహ్న భోజన వంటలకు గ్యాస్‌కొరత


