రైతులను ఆదుకుంటాం.. | - | Sakshi
Sakshi News home page

రైతులను ఆదుకుంటాం..

Mar 25 2026 6:53 AM | Updated on Mar 25 2026 6:53 AM

రైతులను ఆదుకుంటాం..

33 శాతం కంటే ఎక్కువ నష్టం జరిగితే పరిహారం

జిల్లా వ్యవసాయాధికారిణి సత్యవతి

వీరఘట్టం: పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని జిల్లా వ్యవసాయ శాఖాధికారిణి జి.సత్యవతి అన్నారు. మండలంలో ఇటీవల వీచిన ఈదురుగాలులకు నేలమట్టమైన మొక్కజొన్న, అరటి పంటలను మంగళవారం ఆమె తమ బృందంతో కలిసి పరిశీలించారు. కిమ్మి, చిట్టపులివలస, నడిమికెల్ల తదితర గ్రామాల్లో పంటలను పరిశీలించారు. 33 శాతం కంటే ఎక్కువ నష్టం జరిగితే పరిహారం వస్తుందని, అటువంటి రైతుల పేర్లు నమోదు చేస్తామని సూచించారు. అలాగే పిందె దళలో ఉన్న పంటలను కాపాడుకునేందుకు చేపట్టాల్సిన చర్యలను రైతులకు వివరించారు. ఆమెతో పాటు ఏడీఏ రత్నకుమారి, వీరఘట్టం ఏఓ జె.సౌజన్య తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement