అంతర్‌ వర్సిటీ ఖోఖో పోటీలకు జీఎంఆర్‌ విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

అంతర్‌ వర్సిటీ ఖోఖో పోటీలకు జీఎంఆర్‌ విద్యార్థులు

Mar 25 2026 6:53 AM | Updated on Mar 25 2026 6:53 AM

సారా ధ్వంసం

రాజాం సిటీ: సౌత్‌జోన్‌ అంతర్‌ విశ్వవిద్యాలయాల ఖోఖో పోటీలకు జీఎంఆర్‌ ఐటీ డీమ్డ్‌ టుబీ యూనివర్సిటీ విద్యార్థులు ఎంపికయ్యారని పీడీ బీహెచ్‌ అరుణ్‌కుమార్‌ మంగళవారం తెలిపారు. ఈ పోటీలు ఈ నెల 26 నుంచి 29 వరకు కర్నాటక రాష్ట్రం దావన్‌గిరీలో జరగనున్నాయని పేర్కొన్నారు. ఇటీవల రఘు ఇంజినీరింగ్‌ కళాశాలలో జరిగిన ఎంపికలో జి.సాయిగణేష్‌, ఎస్‌.రోహిత్‌ చక్కని ప్రతిభ కనబరిచి సౌత్‌జోన్‌కు ఎంపికయ్యారని తెలిపారు. వీరిని వీసీ డాక్టర్‌ జె.గిరీష్‌, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సీఎల్‌వీఆర్‌ఎస్‌వీ ప్రసాద్‌, స్టూడెంట్స్‌ డీన్‌ డాక్టర్‌ వి.రాంబాబు, విద్యార్థులు తదితరులు అభినందించారు.

కళ్లికోటలో గజరాజులు

కొమరాడ: నాగావళి నది ఆవల వైపున్న గజరాజుల గుంపు మంగళవారం నది దాటి కళ్లికోట గ్రామ పరిసరాల్లోకి చేరుకుంది. దీంతో ఈ ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. రూ.వేలల్లో పెట్టుబడి పెట్టిన పంట దిగుబడులు ప్రస్తుతం వచ్చే తరుణంలో గజరాజుల సంచారంతో నాశనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గజరాజులను ఈ ప్రాంతం నుంచి తరలించాలని రైతులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా కళ్లికోట, దుగ్గి, గుణానపురం గ్రామాల ప్రజలు, రైతులు రాత్రి వేళ పొలాల్లోకి వెళ్లొద్దని అటవీ శాఖ అధికారులు సూచించారు. ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని కోరారు.

కురుపాం: కురుపాం సర్కిల్‌ పరిధిలో వివిధ కేసులలో సీజ్‌ చేసిన సుమారు 148 లీటర్ల నాటుసారా, ఆరు లీటర్ల మద్యం విజయనగరం డిప్యూటీ కమిషనర్‌ ఆదేశాల మేరకు పార్వతీపురం మన్యం జిల్లా అసిస్టెంట్‌ ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ ఎ.సంతోష్‌ సమక్షంలో ధ్వంసం చేసినట్టు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. అక్రమ మద్యం, సారా విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు. ఎక్కడైనా సారా విక్రయాలు జరిగితే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement