సమన్వయంతో పార్టీ పటిష్టతకు కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

సమన్వయంతో పార్టీ పటిష్టతకు కృషి చేయాలి

Mar 25 2026 6:53 AM | Updated on Mar 25 2026 6:53 AM

సమన్వయంతో పార్టీ పటిష్టతకు కృషి చేయాలి

జెడ్పీ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ జిల్లా

అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు

విజయనగరం: అధికారంలో ఉన్నా.. లేకున్నా నిత్యం ప్రజల పక్షాన నిలిచే వైఎస్సార్‌సీపీ పటిష్టతకు పార్టీ శ్రేణులతో కలిసి సమన్వయంతో పని చేయాలని విజయనగరం జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు సూచించారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోని బొబ్బిలి నియోజకవర్గ పరిశీలకులుగా నియామకమైన రొంగలి జగన్నాధంతో పాటు శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్తగా నియామకమైన చింతాడ రవి తమ అనుచరులతో మజ్జి శ్రీనివాసరావును మంగళవారం మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ సిద్ధాంతాలను, అమలు చేసిన పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని సూచించారు. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజ్యా వ్యతిరేక విధానాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని చెప్పారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement