పోలీస్‌ కుటుంబాల సంక్షేమానికి కృషి | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ కుటుంబాల సంక్షేమానికి కృషి

Mar 25 2026 6:53 AM | Updated on Mar 25 2026 6:53 AM

పోలీస్‌ కుటుంబాల సంక్షేమానికి కృషి

ఏపీఎస్‌పీ బెటాలియన్‌ కమాండెంట్‌

రవిశంకర్‌రెడ్డి

డెంకాడ: ఐదవ ఏపీఎస్‌పీ బెటాలియన్‌ పోలీస్‌ కుటుంబాల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని కమాండెంట్‌ వై.రవిశంకర్‌రెడ్డి అన్నారు. విజయనగరానికి చెందిన స్వామి కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో బెటాలియన్‌లో యూనియన్‌ ఫంక్షన్‌ హాల్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. శిబిరంలో 237 మంది పోలీస్‌ అధికారులు, సిబ్బంది, వారి కుటంబాలకు వైద్య పరీక్షలు చేశారు. శిబిరంలో ప్రముఖ కంటి వైద్యులు మంచు కుమారస్వామి, రాహుల్‌, రంజిత్‌ తదితరులు వైద్య సేవలు అందించారు. కార్యక్రమంలో అదనపు కమాండెంట్‌ సి.రాజారెడ్డి, అసిస్టెంట్‌ కమాండెంట్‌లు సి.రాజారెడ్డి, ఎం.గోపాలకృష్ణ, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement