రైలులోనే గర్భిణి ప్రసవం | - | Sakshi
Sakshi News home page

రైలులోనే గర్భిణి ప్రసవం

Mar 25 2026 6:51 AM | Updated on Mar 25 2026 6:51 AM

తల్లీబిడ్డ క్షేమం

పార్వతీపురం రూరల్‌: రైలులో ప్రయాణిస్తూ ఓ గర్భిణి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఒడిశాలోని రూర్కెలా నుంచి తమిళనాడులోని జోలార్‌పైట్టె జంక్షన్‌కు అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో సప్నకుమారి అనే మహిళ భర్తతో కలిసి మంగళవారం ప్రయాణిస్తోది. ఏడు నెలల గర్భిణి అయిన ఆమెకు రాయగడ దాటిన తర్వాత ఒక్కసారిగా పురిటినొప్పులు మొదలయ్యాయి. రైలు పార్వతీపురం బెలగాం స్టేషన్‌ సమీపించేసరికి పురినొప్పులు ఎక్కువ కావడంతో తోటి ప్రయాణికులు ఆమెవద్దకు చేరుకుని ప్రసవానికి సహకరించారు. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీస్‌ (జీఆర్పీ) సిబ్బంది, హెచ్‌సీ రత్నకుమార్‌ రైల్వే స్టేషనన్‌కు చేరుకుని తల్లీబిడ్డను పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement