‘ఆదర్శ’చదువులకు ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

‘ఆదర్శ’చదువులకు ఆహ్వానం

Mar 25 2026 6:51 AM | Updated on Mar 25 2026 6:51 AM

విజయనగరం అర్బన్‌: జిల్లాలోని 13 ఆదర్శ పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం ప్రవేశాలకోసం విద్యార్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు డీఈఓ యు.మాణిక్యంనాయుడు తెలిపారు. పాఠశాలల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపుల్లో ఆంగ్ల మాధ్యమంలో ఉచిత విద్య బోధిస్తామన్నారు. జల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు వచ్చేనెల 30వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ విద్యార్థులకు రూ.200, ఎీస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.150లు దరఖాస్తు ఫీజును చెల్లించాల్సి ఉంటుందన్నారు. పదో తరగతిలో సాధించిన మార్కులు, రిజర్వేషన్‌ నిబంధనల ప్రకారం ప్రవేశాలు కల్పిస్తామన్నారు.

మిమ్స్‌ డైరెక్టర్‌కు జాతీయ అవార్డు

నెల్లిమర్ల: మిమ్స్‌ వైద్యకళాశాల అకడమిక్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వేణుగోపాలరావు తన్నీరు అనస్థీషియా బోధన విభాగంలో అందిస్తున్న సేవలకు తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్‌ కేంద్రంగా పనిచేస్తున్న నేషనల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌షిప్‌ డెవలప్మెంట్‌ (ఎన్‌ఎఫ్‌ఈడీ) సంస్థ ప్రతినిధులు అవార్డును ప్రకటించారు. ఇటీవల కోయంబత్తూర్‌లో జరిగిన గ్లోబల్‌ కాంక్లేవ్‌ ఆన్‌ సస్టైనబుల్‌ డెవలప్మెంట్‌ సదస్సులో 39వ సమగ్ర జాతీయ అవార్డు–2026ను సంస్థ చైర్మన్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఆర్‌.గణేషన్‌ చేతుల మీదుగా వేణుగోపాలరావు అందుకున్నారు. ఆయనకు జాతీయస్థాయి అవార్డు రావడం పట్ల మిమ్స్‌ చైర్మన్‌ అల్లూరి సత్యనారాయణరాజు, మేనేజింగ్‌ ట్రస్టీ డాక్టర్‌ ప్రవీణ్‌ వర్మ, లైఫ్‌ ట్రస్టీ రామకృష్ణరాజు, డీన్‌ డాక్టర్‌ లక్ష్మీకుమార్‌, మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాయక్‌, మెడికల్‌ డైరెక్టర్‌ రఘురాం, తదితరులు హర్షం వ్యక్తంచేశారు. ఆయనకు అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement