చెస్ విజేత లక్ష్మీచరణ్
బొబ్బిలి: విశాఖపట్నంలోని ఎంఆర్ మండల్‌లో నిర్వహించిన ఏపీ స్టేట్ చెస్ చాంపియన్‌షిప్‌లో పట్టణానికి చెందిన గొర్లె లక్ష్మీచరణ్ విజేతగా నిలిచాడు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 200 మంది క్రీడాకారులు పాల్గొన్న పోటీలో ఏడురౌండ్లకు ఆరున్నర పాయింట్లు సాధించి చాంపియన్ షిప్‌ను సొంతం చేసుకున్నాడు. లక్ష్మీ చరణ్ తండ్రి జగదీశ్వర్ కె.కృష్ణాపురం హైస్కూల్‌లో హెచ్‌ఎంగా, తల్లి విజయలక్ష్మి బొబ్బిలి మున్సిపల్ స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్నారు. చెస్‌లో కుమారుడు రాణిస్తుండడంతో మురిసిపోతున్నారు.
ఆకట్టుకున్న జాతీయ జెండా
రాజాం సిటీ: రాజాంలోని కస్పావీధికి చెందిన మైక్రోఆర్టిస్ట్ ముగడ జగదీష్ వెండితో సూక్ష్మ జాతీయ జెండాను సోమవారం రూపొందించి అబ్బురపరిచారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 0.300 మిల్లీ గ్రాముల వెండి రేకుతో పావురం జాతీయజెండాను పట్టుకునేలా తయారుచేసి జెండాకు రంగులు అద్దారు. దీనిని తయారుచేయడానికి రెండు గంటల సమయం పట్టిందని ఆయన తెలిపారు.
దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి
● గణతంత్ర వేడుకల్లో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
విజయనగరం రూరల్: దేశాభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. స్థానిక జెడ్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన 77వ గణతంత్ర వేడుకల్లో జెడ్పీ సీఈఓ బి.వి.సత్యనారాయణ జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జెడ్పీ చైర్మన్ జాతీయ జెండాకు గౌరవ వందనం చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి, భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలువేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతీ పౌరుడు మహనీయుల త్యాగాలు గుర్తుచేసుకోవాలన్నారు. రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఇద్దరు జెడ్పీ ఉద్యోగులకు ఉద్యోగోన్నతి నియామక పత్రాలను, ఒకరికి కారుణ్య ధ్రువీకరణపత్రాన్ని జెడ్పీ చైర్మన్ అందజేశారు. విధుల్లో ప్రతిభ కనబరిచిన జెడ్పీ ఉద్యోగ, సిబ్బందికి ప్రశంసాపత్రాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ ఆర్.వెంకటరామన్, డీపీఓ మల్లిఖార్జునరావు, ఈఈ రత్నకుమార్, జీఎస్‌డబ్ల్యూఎస్, చీపురుపల్లి, విజయనగరం డీఎల్‌డీవోలు, విశ్రాంత ఎస్‌ఈ పి.విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
చెస్ విజేత లక్ష్మీచరణ్
చెస్ విజేత లక్ష్మీచరణ్


