ఆకట్టుకున్న గుర్రాల పరుగు ప్రదర్శన
వేపాడ: మండలంలోని జాకేరు గ్రామంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన గుర్రాల పరుగు ప్రదర్శన ఆకట్టుకుంది. గ్రామంలో పైడమ్మ చిన్నమ్మ పేరంటాలు, వీరాంజనేయస్వామీ తీర్థమహోత్సవం సందర్భంగా నిర్వహించిన గుర్రాల పరుగు ప్రదర్శనలో విశాఖ, విజయనగరం, అనకాపల్లి జిల్లాలకు చెందిన 15 గుర్రాలు పాల్గొన్నాయి. వాటిలో సింగపూర్ సత్యనారాయణ దేవర గుర్రం ప్రథమస్థానం, రెండోస్థానంలో ఎస్.సత్యనారాయణ శక్తి గుర్రం, మూడో స్థానంలో ధీర అప్పలనాయుడి గుర్రం, నాల్గోస్దానంలో వైజాగ్‌కు చెందిన అమర్ ఓజీర్ గుర్రం, ఐదోస్థానంలో వైజాగ్‌కు చెందిన దీక్షిత్ గుర్రం, ఆరో స్థానంలో జామికి చెందిన డెడ్ లైన్‌గుర్రాలు నిలిచి వరుసగా రూ.12వేలు, రూ.పదివేలు, రూ.ఎనిమిదివేలు, రూ.ఆరువేలు, రూ.నాలుగువేలు, రూ.రెండువేలు చొప్పున నగదు బహుమతులు సాధించాయి.
సత్తాచాటిన వస్తాదులు
అలాగే జాకేరు తీర్థం సందర్భంగా నిర్వహించిన సంగిడి రాళ్ల పోటీల్లో విశాఖ, విజయనగరం, అనకాపల్లి జిల్లాలకు చెందిన వస్తాదులు పాల్గొన్నారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా సన్యాసిరావు, సత్యం, రాము వ్యవహరించారు. ఈ పోటీలను పోటు, తీత, ఇసురు మూడు విభాగాల్లో నిర్వహించారు. వాటిలో తీత విభాగంలో కిలారి ఎరునాయుడు ప్రథమ, వారాది వెంకటేష్ ద్వితీయ(సిరిపురం), బి.గోవిందరెడ్డి రామచంద్రంపేట తృతీయస్థానం సాధించారు. పోటు విభాగంలో బి.గోవిందరెడ్డి ప్రథమ, బాకీ రశ్రీను ద్వితీయ, బోర రమణ తృతీయస్థానాలు, ఇసురు విభాగంలో బాకీ గోవింద ప్రథమ, కిలారి ఎరునాయుడు ద్వితీయ, బాకీ శ్రీను తృతీయ స్థానాలు సాధించగా బెస్ట్ వస్తాద్‌గా బోరగోవింద రెండు విభాగాల్లోను, వారాది వెంకటేష్ ఇసురు విభాగంలో నిలిచారు. వారికి రూ.రెండువేలు, రూ.పదిహేనువందలు, రూ. వెయ్యి చొప్పున మూడు విభాగాల విజేతలకు గ్రామసర్పంచ్ బుద్దాచిన్నమ్మలు, అప్పలనాయుడు గ్రామపెద్దలు, కమిటీ సభ్యులు చేతులమీదుగా అందజేశారు.
ఆకట్టుకున్న గుర్రాల పరుగు ప్రదర్శన


