ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలి
● ఏఐసీసీ సభ్యురాలు వైరిచర్ల శ్రుతీదేవి
పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఏఐసీసీ సభ్యురాలు, సుప్రీంకోర్టు న్యాయవాది వైరిచర్ల శ్రుతీదేవి ఆదివారం ప్రారంభించారు. డీసీసీ జిల్లా అధ్యక్షుడు వంగల దాలినాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శృతిదేవి మాట్లాడుతూ..ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, వారి సమస్యలపై పోరాడేందుకు ఈ కార్యాలయం వేదిక కానుందని తెలిపారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో అవకాశం వస్తే ఎంపీగా పోటీ చేస్తానని వెల్లడించారు. కార్యక్రమంలో భాగంగా పలువురు పార్టీలో చేరగా, వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌న్‌చార్జ్‌లు, వివిధ విభాగాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.


