ఎల్లారమ్మ జాతర కమిటీలో వివాదం
బ్రాయిలర్
లైవ్ డ్రెస్‌డ్ స్కిన్‌లెస్
శ్రీ150 శ్రీ270 శ్రీ280
చికెన్
● ఇరు వర్గాల మధ్య ఘర్షణ
● ఎండోమెంట్ ఆధ్వర్యంలో జాతర నిర్వహణ అని స్పష్టం చేసిన ఈఓ
జామి: జామి ఎల్లారమ్మ జాతర మూహూర్తం తేదీల ఖరారు అనంతరం నిర్వహణ కమిటీ విషయంలో అమ్మవారి జాతర కమిటీ రెండు వర్గాల (వైఎస్సార్‌సీపీ, టీడీపీ) మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు రెండు సంవ్సరాల కాలపరిమితికి ఉత్సవ కమిటీ నియామకం చేసింది. ఆ కమిటీ సమయం 2026 మార్చి 6వరకు ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇటీవల మళ్లీ ఇటీవల టీడీపీ వర్గీయులకు ఉత్సవ కమిటీ పేరున మరో కమిటీని ఎండోమెంట్ శాఖ నియమించింది. దీంతో ఈ విషయం తీవ్ర గందరగోళానికి దారితీసింది. జాతర ఏ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించాలని ఎండోమెంట్ ఈఓ ప్రసాద్‌రావును ఆదివారం రెండు కమిటీల సభ్యులు నిలదీశారు. గ్రామాల్లో చిచ్చు పెట్టడానికి అల్లర్లు సృష్టించడానికి ఎండోమెంట్ అధికారులు కారణమని గ్రామ సర్పంచ్ చిప్పాడ లక్ష్మి, ఉప సర్పంచ్ అల్లు పద్మ, వైఎస్సార్‌సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అల్లు అవినాష్ తదితరులు నిలదీశారు. ఇంకా పాత కమిటీకి నిర్వహణ సమయం ఉందని అలాంటప్పుడు కొత్తగా ఉత్సవ కమిటీ నియామకం ఎలా చేశారని నిలదీశారు. దీంతో టీడీపీ వర్గీయులు అధికారంలో మా ప్రభుత్వం ఉందని మేము నిర్వహిస్తామని ఉత్సవ కమిటీ కూడా వేశారని తెలపడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. కొంత సమయం తోపులాట జరిగింది. ఎండోమెంట్ ఈఓ దీనికి పరిష్కారం చెప్పాలని నిలదీయడంతో ఎండోమెంట్ ఈఓ ప్రసాదరావు స్పందిస్తూ ఈ ఏడాది జాతరను ఎండోమెంట్ నిర్వహిస్తుందని తేల్చిచెప్పారు. రెండు కమిటీల వారు జాతర సజావుగా సాగేవిధంగా సహాయసహకారాలు అందించాలని తేల్చి చెప్పడంతో వివాదం సద్గుమణిగింది.
ఎల్లారమ్మ జాతర కమిటీలో వివాదం


