ఎడ్లు పరుగు పోటీల్లో వల్లంపూడి ఫస్ట్
వేపాడ: మండలంలో వల్లంపూడి లో సాంబమూర్తి తీర్థమహోత్సవం సందర్భంగా ఆదివారం సాయంత్రం నిర్వహించిన ఎడ్ల పరుగు ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ పోటీల్లో అనకాపల్లి, విజయనగరం జిల్లాలకు చెందిన 12 జతలు ఎడ్లు పాల్గొన్నాయి. వాటిలో వల్లంపూడి ఏడువాక సత్తిబాబు ఎడ్లు ప్రథమ స్థానం సాధించి రూ.15వేలు, దేవరాపల్లి జైవీరాంజనేయ ఎడ్లు రెండోస్థానంలో నిలిచి రూ.12 వేలు, మూడోస్థానంలో నిలిచిన వావిలపాడు ఎడ్లు రూ.పదివేలు నగదు బహుమతులు అందుకున్నారు. తీర్థం సందర్భంగా సాంబమూర్తి ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేకపూజలు, అభిషేకాలు నిర్వహించారు. విజేతలకు గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు చేతుల మీదుగా నగదు బహుమతులు అందజేశారు.


