వైద్యం కోసం వెళ్తూ మృత్యులోకాలకు
● బైక్‌ను వెనుక నుంచి ఢీకొన్న బస్సు
● ఇద్దరు వ్యక్తుల దుర్మరణం
● గొట్లాం బైపాస్ రోడ్డు వద్ద ప్రమాదం
బొండపల్లి: వైద్యం చేయించుకునేందుకుగాను వరుసకు అల్లుడైన వ్యక్తి సహాయంతో బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి వస్తున్న అర్టీసీ బస్సు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. గొట్లాం గ్రామం సమీపంలోని బైపాస్ రోడ్డు వద్ద ఆదివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి ఎస్సై.యు.మహేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దత్తిరాజేరు మండలంలోని పోరలి గ్రామానికి చెందిన పిళ్లా రామునాయుడు(33)తో పాటు అదే గ్రామానికి చెందిన మిత్తిరెడ్డి ఎల్లయ్య(48) బైక్ పై విజయనగరంలోని ఆస్పత్రికి వెళ్తుండగా గొట్లాం బైపాస్ రోడ్డు బ్రిడ్జి సమీపంలో సాలూరు నుంచి విజయనగరం వెళ్తున్న అర్టీసీ బస్సు వెనుక నుంచి బైక్‌ను ఢీకొట్టడంతో ఇద్దరూ మృతిచెందారు. ఈ ప్రమాదంలో బైక్ పూర్తిగా నుజ్జునుజ్జయింది.
ఎల్లయ్య కొద్ది కాలంగా పైల్స్‌తో బాధ పడుతుండగా వరుసకు అల్లుడైన రామునాయుడు తన బైక్‌పై విజయనగరంలో వైద్యం చేయించేందుకు ఉదయం 8 గంటల సమయంలో తీసుకుని వెళ్తుండగా ప్రమాదం జరిగింది. రామునాయుడికి భార్య సాయితో పాటు రెండు సంవత్సరాల వయస్సు ఉన్న పాప ఉన్నది. ఎల్లయ్యను భార్య విడిచి పెట్టడంతో ఒంటరిగా జీవిస్తున్నాడు. రామునాయుడు పెయింటర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా కుటుంబానికి ఆధారమైన పెద్ద దిక్కు కోల్పోవడంతో కుటుంబంలో విషాధఛాయలు అలుముకున్నాయి. గ్రామంలోని ఇద్దరు వ్యక్తులు చని పోవడంతో ఆస్పత్రి వద్ద, సంఘటనా స్థలం వద్ద గ్రామస్తులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. సంఘటనా స్దలానికి వైస్ ఎంపీపీ మిత్తిరెడ్డి రమేష్ చేరుకుని అండగా నిలిచి సహాయ చర్యల్లో పాల్గొన్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం జిల్లా కేంద్ర సర్వజన ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ
ప్రమాదం జరిగిన గురైన గొగోట్లాం బైపాస్ రోడ్డు ప్రాంతాన్ని ఎస్పీ ఎ.దామోదర్‌తో పాటు పోలీసులు పరిశీలించి ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. కార్యక్రమంలో బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి, గజపతినగరం సీఐ జీఏవీ రమణ, పోలీసులు పాల్గొన్నారు.
వైద్యం కోసం వెళ్తూ మృత్యులోకాలకు


