గంజాయి కేసులో ముద్దాయికి 10 ఏళ్లజైలు | - | Sakshi
Sakshi News home page

గంజాయి కేసులో ముద్దాయికి 10 ఏళ్లజైలు

Jan 13 2026 5:38 AM | Updated on Jan 13 2026 5:38 AM

గంజాయ

గంజాయి కేసులో ముద్దాయికి 10 ఏళ్లజైలు

విజయనగరం క్రైమ్‌: గంజాయి కేసులో ముద్దాయికి 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ విజయనగరం ఫస్ట్‌ అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జి ఎం.మీనాదేవి తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ ఏఆర్‌.దామోదర్‌ సోమవారం తెలిపారు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని ఎస్‌.కోట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 2023 ఏప్రిల్‌ 10 వతేదీన ఎస్‌కోట పోలీసులకు వచ్చిన కచ్చితమైన సమాచారంతో రామనగర్‌ రోడ్డు వద్ద వాహన తనిఖీలు చేపట్టగా, అరకు నుంచి కారులో వస్తున్న బిస్మా చరణ్‌ సుగ్రీ (33) అనే వ్యక్తిని పట్టుబడడంతో అదుపులోకి తీసుకుని కారులో ఉన్న 50కిలోల గంజాయితో పాటు, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం, కేసు దర్యాప్తు చేపట్టిన అప్పటి ఎస్‌.కోట ఎస్సై నిందితుడిని రిమాండ్‌కు తరలించగా, అప్పటి సీఐ ఎస్‌.బాల సూర్యారావు కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. ఆ కేసు విచారణలో నిందితుడిపై నేరారోపణలు రుజువు కావడంతో విజయనగరం ఫస్ట్‌ అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జి ఎం.మీనాదేవి పై విధంగా తీర్పు వెల్లడించారు.

70 లీటర్ల సారా పట్టివేత

వీరఘట్టం: ఎకై ్సజ్‌ అధికారుల కార్డన్‌ సెర్చ్‌లో భాగంగా 70 లీటర్ల సారా పట్టుబడింది. ఈ మేరకు ఎకై ్సజ్‌ సీఐలు వెంకటరావు, సూర్యకుమారిలు సోమవారం తెలిపిన వివరాల ప్రకారం..చిదిమి గ్రామశివారు, వీరఘట్టంలోని రెల్లివీధి, కొండ వీధుల్లో సోమవారం ఉదయం 20 మంది ఎకై ్సజ్‌ అధికారులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఈ తనిఖీల్లో ముగ్గురు వ్యక్తులపై కేసులు నమోదు చేసి 70 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు.

సారా తరలిస్తున్న ఇద్దరు అరెస్టు

కురుపాం: సారా తరలిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు కురుపాం ఎకై ్సజ్‌ సీఐ పి.శ్రీనివాసరావు తెలిపారు. నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా సోమవారం కురుపాం ఎకై ్సజ్‌ సర్కిల్‌పరిధిలో ఉన్న కురుపాం మండలం చప్పగొత్తిలి, నీలకంఠాపురం గ్రామాల పరిధిలో సారా విక్రయిస్తున్న చప్పగొత్తిలి గ్రామానికి చెందిన ఆరిక సుబ్బారావు, నీలకంఠాపురం గ్రామానికి చెందిన ఆరిక మురళిలను 20 లీటర్ల సారాతో అరెస్టు చేసినట్లు తెలిపారు. వారిద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపించినట్లు చెప్పారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఎవరూ సారా క్రయ విక్రయాలు చేసి కేసుల్లో చిక్కుకోవద్దని సూచించారు.ఈ దాడుల్లో ఎకై ్సజ్‌ ఎస్సై రాజశేఖర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

బ్యాగులో రూ.50వేలు చోరీ

పూసపాటిరేగ: మండలకేంద్రం పూసపాటిరేగలో సోమవారం ఉదయం చోరీ జరిగింది. చింతపల్లి గ్రామానికి చెందిన బర్రి పరదేశమ్మ బ్యాంకు నుంచి నగదు తీసుకుని పూసపాటిరేగలోని మెయిన్‌వీధిలో కిరాణాసామగ్రి కొనుగోలు చేస్తుండగా ఆమె చేతిలో ఉన్న సంచిలోని నగదు మాయ మైంది. అగంతుకుడు సంచిని బ్లేడుతో కత్తిరించి నగదు చోరీ చేసినట్లు బాధితురాలు వాపోయింది. బ్యాంకులో బంగారం కుదువ పెట్టి తీసుకొచ్చిన నగదును అగంతుకుడు మాయం చేయడంతో బాధితురాలు లబోదిబోమంది. దీనిపై పూసపాటిరేగ పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు.

42 మద్యం బాటిల్స్‌ స్వాధీనం

గరుగుబిల్లి: పార్వతీపురం–శ్రీకాకుళం ప్రధాన రహదారి పరిధిలో పిట్టలమెట్ట జంక్షన్‌ వద్ద మోటారు సైకిల్‌పై అక్రమంగా తరలిస్తున్న 42 మద్యం బాటిల్స్‌ సోమవారం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై షేక్‌ ఫకృద్దీన్‌ తెలిపారు. పాలకొండకు చెందిన రత్నాల దినేష్‌కుమార్‌ అక్రమంగా మద్యం తరలిస్తున్నట్లు స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు అందించిన సమాచారం మేరకు దాడులను నిర్వహించి మద్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పార్వతీపురం మెజిస్ట్రేట్‌ కోర్టుకు తరలిస్తున్నట్లు ఎస్సై చెప్పారు. ఎక్కడైనా మద్యం నిల్వలున్నా, మద్యం తరలించినా శాఖా పరమైన చర్యలుంటాయని హెచ్చరించారు.

గంజాయి కేసులో  ముద్దాయికి 10 ఏళ్లజైలు1
1/3

గంజాయి కేసులో ముద్దాయికి 10 ఏళ్లజైలు

గంజాయి కేసులో  ముద్దాయికి 10 ఏళ్లజైలు2
2/3

గంజాయి కేసులో ముద్దాయికి 10 ఏళ్లజైలు

గంజాయి కేసులో  ముద్దాయికి 10 ఏళ్లజైలు3
3/3

గంజాయి కేసులో ముద్దాయికి 10 ఏళ్లజైలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement