సివిల్స్‌కు ఉచిత శిక్షణ
● డిసెంబర్ 3 లోగా దరఖాస్తులు సమర్పించాలి
పార్వతీపురంటౌన్: సివిల్స్‌లో ప్రిలిమ్స్, మెయిన్ పరీక్షలకు సంబంధించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, నిరుద్యోగ అభ్యర్ధులకు ఉచిత శిక్షణ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా బీసీ సంక్షేమ, సాధికారత అధికారి ఇ.అప్పన్న గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. అభ్యర్థులు విద్య, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్, పాన్ కార్డు, 2ఫొటోలు దరఖాస్తుకు జతచేసి డిసెంబర్ 3వ తేదీలోగా దరఖాస్తులను జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ, ఆర్‌సీఎం స్కూల్స్, రూమ్ నంబర్ 8, పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురు, పార్వతీపురం మన్యం జిల్లా వారికి సమర్పించాలని తెలిపారు. పూర్తి వివరాలకు ఫోన్ 8500187124, 9701786751, 9160801497 నంబర్లలో సంప్రదించాలని ప్రకటనలో కోరారు.


