వెయిట్ లిఫ్టింగ్‌లో పల్లవికి గోల్డ్
నెల్లిమర్ల రూరల్: రాజస్థాన్‌లో జరుగుతున్న ఖేలో ఇండియా వెయిట్‌లిఫ్టింగ్ యూనివర్సిటీ గేమ్స్‌లో కొండవెలగాడ గ్రామానికి చెందిన శనపతి పల్లవి సత్తా చాటింది. విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ నుంచి 69 కిలోల విభాగంలో గురువారం పోటీల్లో పాల్గొన్న పల్లవి స్నాచ్‌లో 90 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 110 కిలోలు మొత్తంగా 200 కిలోల బరువును ఎత్తి బంగారు పతకాన్ని కై వసం చేసుకుంది. ఈ సందర్భంగా ఆమెను కోచ్ చల్లా రాము, జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోషియేషన్ ప్రతినిధులు, గ్రామస్తులు అభినందించారు.
ఆటో, బైక్ ఢీకొని మహిళకు గాయాలు
గంట్యాడ: ఆటో, బైక్ ఢీకొని ఓ మహిళకు గాయాలయ్యాయి. మండలంలోని నీలావతి గ్రామానికి చెందిన చింతాడ మంగమ్మ, తన బంధువుతో కలిసి ఆటోలో ఎస్.కోట వెళ్తోంది. వసాది గ్రామ సమీపం వద్ద ఎదురుగా వస్తున్న బైక్, ఆటో ఢీకొట్టడంతో రెండు వాహనాలు బోల్తా పడ్డాయి. దీంతో ఆటోలో కూర్చున్న మహిళ రోడ్డు మీదకు జారి పడిపోవడంతో కా లు విరిగింది. హుటాహుటిన ఆమెను కుటుంబసభ్యులు చికిత్స నిమత్తం విజయనగరంలో ని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు.
వెయిట్ లిఫ్టింగ్‌లో పల్లవికి గోల్డ్


