రాష్ట్రస్థాయి స్కేటింగ్ పోటీల్లో జిల్లాకు పతకాలు
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరిగిన స్కేటింగ్‌పోటీల్లో జిల్లా క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి సత్తాచాటారు. ఈనెల 1 నుంచి 8వ తేదీ వరకు కాకినాడలో జరిగిన 37వ అంతర్ జిల్లాల రోలర్ స్కేటింగ్ పోటీల్లో విజయనగరం జిల్లా నుంచి 25 మంది క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించి 3 బంగారు పతకాలు, 7 వెండి పతకాలు, 3 కాంస్య పతకాలు దక్కించుకున్నారు. బంగారు పతకాలు దక్కించుకున్న ఉజ్వల్, దేవాన్స్, భార్గవసాయిలు త్వరలో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచడంతో పాటు జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించిన క్రీడాకారులను రాష్ట్ర రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి ఏపీవీ.మూర్తి, జిల్లా స్కేటింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు సీతారామరాజు అభినందించారు. కార్యక్రమంలో సభ్యులు శ్రీనివాసరావు, మోహన్ రావు, కోచ్‌లు బద్రీ నారాయణ, మురళీకృష్ణ, శ్యామ్, స్కేటర్లు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


