జిల్లా విద్యార్థినుల ప్రతిభ
జాతీయస్థాయిలో..
● స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్‌లో ఆవిష్కరణలు
● విద్యార్థి ఇన్నోవేటర్ కార్యక్రమానికి ఎంపిక
పాలకొండ రూరల్: కేంద్ర ప్రభుత్వం చొరవతో 21వ శతాబ్దపు నైపుణ్యాలను విద్యార్థులకు అందించడం ద్వారా వారిని ట్రాన్స్‌ఫర్మేటివ్ నాయకులుగా తీర్చి దిద్దవచ్చని యంత్రాంగం నిర్ణయించింది. ఈ క్రమంలో ఉద్దేశించిన కార్యక్రమమే స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్. కేంద్ర మానవ వనరుల అభివద్ధి శాఖ, అటల్ ఇన్నోవేషన్ మిషన్, నీతి ఆయోగ్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. తాజాగా 2024–25 ఏడాదికి సంబంధించి చేపట్టిన స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ ఆవిష్కరణల్లో పార్వతీపురం మన్యం జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబర్చినట్లు జిల్లా విద్యాశాఖాధికారి బి.రాజ్‌కుమార్ తెలిపారు. గరుగుబిల్లి మండలానికి చెందిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల బాలికల పాఠశాల, గుమలక్ష్మీపురం మండలానికి చెందిన కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థుల ఆవిష్కరణలు మొదటి 100 స్థానాల్లో జాతీయ స్థాయిలో నిలిచి ‘విద్యార్థినుల ఆవిష్కర్తల’ కార్యక్రమానికి ఎంపికై నట్లు తెలిపారు. సదరు విద్యార్థులు గత ఏడాదిలో జరిగిన స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్‌లో జాతీయస్థాయిలో తొలి వెయ్యి ఆలోచనల్లో స్థానం పొంది అటల్ ఇన్నోవేషన్ మిషన్, నీతి అయోగ్, డెల్ టెక్నాలజీస్, లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ సంయుక్తంగా చేపట్టనున్న ‘విద్యార్ధి ఇన్నోవేటర్’ కార్యక్రమానికి ఎంపికయ్యారు. ఈ విషయం సంబంధిత అఽధికారులు పాఠశాలలకు మెయిల్ ద్వారా, ఎంపికై న విద్యార్థులకు వ్యక్తిగతంగా ఫోన్ ద్వారా సమాచారం అందించారు.
గైడ్ టీచర్ల సహకారంతో..
గుమలక్ష్మీపురం కేజీబీవీకి చెందిన గైడ్ టీచర్ ఎం.రజని (సీఆర్టీ–బీఎస్) ప్రోత్సాహంతో 10వ తరగతి విద్యార్థినులు లంక హారిక, రథో సాయివర్షితలు జనరేటింగ్ ఎలక్ట్రిసిటీ విత్ రెయిన్ వాటర్ అనే ప్రాజెక్టును, ఇదే పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థిని మనస్వి సాయిహర్షిత సంయుక్తంగా మిరాక్యులస్ మెడిసినల్ వేల్యూస్ ఆఫ్ వేరొనియా అనే ప్రాజెక్టులను అవిష్కరించారు. గరుగుబిల్లి మండలంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన ఉపాధ్యాయిని ఝాన్సీ ప్రియదర్శిని (సీఆర్టీ–సైన్స్) సారథ్యంలో 10వ తరగతి విద్యార్థినులు ఇందుప్రియ, శ్రావణి, సీహెచ్.ఇందు ఎకో ఫ్రెండ్లీ ఫ్లోర్ కలర్స్ ప్రాజెక్టును ఆవిష్కరించి జాతీయస్థాయికి ఎంపికయ్యారు.
విద్యార్థినులకు అభినందనలు
ఎంపికై న విద్యార్థినిలకు ఈనెల 17 నుంచి 21 వరకూ ఐదు రోజుల పాటు వర్‌ుచ్యవల్ బూట్ క్యాంప్ నిర్వహించనున్నారు. జిల్లా సత్తాను జాతీయ స్థాయిలో చాటిచెప్పిన విద్యార్థులను, ప్రోత్సహించిన ఉపాధ్యాయులను సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ ఆర్.తేజస్విరావు, జిల్లా సైన్స్ అఽధికారి జి.లక్ష్మణరావులు అభినందించారు.
జిల్లా విద్యార్థినుల ప్రతిభ


