మోంథా ముంచేసింది.. రైతన్నను ఆదుకోండి | - | Sakshi
Sakshi News home page

మోంథా ముంచేసింది.. రైతన్నను ఆదుకోండి

Nov 7 2025 7:47 AM | Updated on Nov 7 2025 7:47 AM

మోంథా

మోంథా ముంచేసింది.. రైతన్నను ఆదుకోండి

–8లో మోంథా ముంచేసింది.. రైతన్నను ఆదుకోండి

రైతులకు పరిహారం అందేలా చూడండి

మంత్రులను కోరిన సభ్యులు

అన్నదాత సుఖీభవ అందించాలని డిమాండ్‌

వైద్యకళాశాలల ప్రైవేటీకరణపై నిలదీత

గిరిజన వైద్యంపై రభస

వాడీవేడిగా సాగిన

జెడ్పీ సర్వసభ్యసమావేశం

తంగుడుబిల్లి రైతుల పరిస్థితి ఏమిటి

–8లో

బస్సుల్లో భద్రత లెస్సు!

తెలుగు రాష్ట్రాల్లో వరుసఘటనలు ప్రయాణికులను హడలెత్తిస్తున్నాయి. పాచిపెంట మండలంఘాట్‌ రోడ్డు ఒడిశా బస్సు దగ్ధమైంది.

విజయనగరం రూరల్‌:

మోంథా తుఫాన్‌ పంటలను ముంచేసింది... రైతన్నకు అపార నష్టం కలిగించింది.. గత ప్రభుత్వంలో అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకా న్ని ఎత్తేయడంతో ఇప్పుడు రైతన్నకు గడ్డుపరిస్థితి ఏర్పడింది.. ప్రీమియం చెల్లించని రైతులకు బీమా అందే పరిస్థితి లేదు.. తక్షణమే పంట నష్టం అంచ నా వేసి రైతులను ఆదుకోవాలంటూ పలువురు సభ్యులు జెడ్పీ సర్వసభ్యసమావేశంలో ప్రస్తావించారు. రైతులను ఆదుకునే చర్యలను వేగవంతం చేయాలని మంత్రులు సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్‌ను కోరారు. విజయనగరం జెడ్పీ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన గురువారం జెడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. తొలుత వ్యవసాయ శాఖపై జరిగిన చర్చ లో రైతుల ఇబ్బందులను, ఆదుకోవాల్సిన ఆవశ్యకతను పలువురు ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు సభ దృష్టికి తెచ్చారు. దీనిపై జెడ్పీ చైర్మన్‌ స్పందిస్తూ పంట నష్టంపై అధికారులు రూపొందించిన నివేదిక లోపభూయిష్టంగా ఉందన్నారు.సాగు సమయంలో ఎరువులు సకాలంలో అందక ఇబ్బందులు పడిన రైతులు, మోంథా తుఫాన్‌ దాటికి పంటలు నష్టపో యి కష్టాల్లో పడ్డారన్నారు. 35 శాతం కన్నా ఎక్కువ పంట నష్టం జరిగితేనే నమోదు చేస్తున్నారని, అంత కన్నా తక్కువ జరిగిన వారి పరిస్థితేంటని ప్రశ్నించా రు. ఇప్పటికీ కొన్నిచోట్ల పంట నీట మునిగి ఉందని, ధాన్యం రంగుమారే అవకాశం ఉందని, వాటిని ఏ విధంగా కోనుగోలు చేస్తారో రైతులకు వివరించా లని మంత్రులను కోరారు. పంటన నష్టం అంచనా గడువు పొడిగించాలని కోరారు.

ధాన్యం సేకరణపై జరిగిన చర్చలో జేసీ సేతుమాధవన్‌ మాట్లాడుతూ జిల్లాకు కోటి గోనె సంచు లు అవసరం అవుతాయని, ప్రస్తుతం జిల్లాస్థాయి లో 50 లక్షల వరకు సర్దుబాటు అవుతున్నాయని, మిగిలిన వాటి కోసం ప్రభుత్వంతో చర్చ జరుగుతోందని తెలిపారు.

రైతులు అవసరానికి మించి ఎక్కువ మోతాదు లో యూరియా వినియోగిస్తున్నారని, దీనివల్ల కాన్సర్‌ వంటి వ్యాధులు వస్తున్నాయని, రైతులకు యూరియా వినియోగంపై అవగాహన కలిగించా లని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు వ్యవసాయ అధికారులకు సూచించారు. ప్రజల ఆరోగ్యం ముఖ్యమని, దీనిని రాజకీయం చేయకూడదని మంత్రి అన్నారు.

వైద్యారోగ్యశాఖపై జరిగిన చర్చలో గిరిజన ఆశ్ర మ పాఠశాలల విద్యార్థుల మృతి చెందినా ఆదుకునేవారే కరువయ్యారని పార్వతీపురం మన్యం జిల్లా లోని గిరిజన మండలాలకు చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు వాపోయారు. గిరిజన విద్యార్థు ల మృతిపై అధికారులు తప్పుడు లెక్కలు ఇవ్వడంపై మండిపడ్డారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు అండగా నిలవాలని, పరిహారం అందజేయాలని డిమాండ్‌ చేశారు.

గత ప్రభుత్వం 17 మెడికల్‌ కాలేజీలను మంజూ రు చేస్తే ఈ ప్రభుత్వం వాటిని ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నించడం బాధాకరమని, దీనివల్ల పేద ప్రజలకు వైద్యం, విద్యార్థులకు వైద్యవిద్య దూరం అవుతుతాయని పలువురు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్‌ కళాశాలల్లో గత ప్రభుత్వం అమలు చేసిన పాలసీని కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. దీనిపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పందిస్తూ పీపీ అపేదే లేదని, ఈ విధానం ప్రజలకు, పేదలకు ప్రయోజనమని భావించి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. ఎంఎస్‌ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ విజయనగరంలో మెడికల్‌ కాలేజీ ప్రారంభమైనా అభివృద్ధి కో సం మరో రూ.600 కోట్లు ఖర్చుచేయాల్సి ఉందని, ఆ లెక్కన అన్ని కాలేజీలకు రూ.వేలకోట్లను ఖర్చు చేయడమంటే ప్రభుత్వానికి భారమవుతుందన్నా రు. ప్రజలకు అందించే సౌకర్యాలలో ఎటువంటి లోపం లేకుండా చూస్తామన్నారు. ఇదే అంశంపై జెడ్పీ చైర్మన్‌ స్పందిస్తూ వైద్యకళాశాలలను ప్రైవేటీకరణ చేయడం సరికాదన్నారు. అభివృద్ధి పనులనేవి నిరంతర ప్రక్రియ అని, ఏ ప్రభుత్వం ఏర్పడినా వాటిని కొనసాగించాలే తప్ప భారమవుతుందని తప్పించుకునే చర్యలు తగవన్నారు.

కొత్త పింఛన్లు ఇచ్చేది ఎప్పుడని పలువురు సభ్యులు ప్రశ్నించగా మంత్రి కొండపల్లి స్పందిస్తూ దరఖాస్తులు తీసుకుంటున్నామని, మంజూరుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

భోగాపురం ఎంపీపీ మాట్లాడుతూ ఎయిర్‌ పోర్ట్‌ నీరు రావాడ పంచాయతీలోకి మళ్లించడంతో గ్రా మంలో కాలు పెట్టలేని పరిస్థితి నెలకొందని, దీనికి పరిష్కారం చూపాలని కోరారు. దీనిపై కలెక్టర్‌ రాంసుందర్‌ రెడ్డి స్పందిస్తూ ఈ సమస్య తన దృష్టికి వచ్చిందని, ఇరిగేషన్‌, రెవెన్యూ, ఎయిర్‌ఫోర్ట్‌ అధికారులతో కలిసి టీం వర్క్‌ జరగాల్సి ఉందని, త్వరలో సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల కలెక్ట ర్లు రాంసుందర్‌ రెడ్డి, డాక్టర్‌ ఎన్‌.ప్రభాకర్‌రెడ్డి, జేసీ సేతుమాధవన్‌, పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌.వైశాలి, ఎమ్మెల్సీ డాక్టర్‌ సురేష్‌బాబు, ఎమ్మెల్యే లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, జెడ్పీ సీఈఓ సత్యనారాయణ, ఉమ్మడి జిల్లాల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

నెల్లిమర్ల మండలంలో ఎన్నో ఏళ్లుగా దేవస్థానం భూములు సాగుచేస్తున్న రైతులకు ఈ క్రాప్‌ ఎందుకు చేయడం లేదని ఎమ్మెల్సీ సురేష్‌ బాబు వ్యవసాయ అధికారులను నిలదీశారు. అవి ప్రస్తుతం వివాదాల్లో ఉందని అందుకే ఇవ్వడం లేదని అధికారులు తెలిపారు. క్యాన్సర్‌ వ్యాధిపై అవగాహన కల్పించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆయన కోరారు.

మోంథా ముంచేసింది.. రైతన్నను ఆదుకోండి 1
1/2

మోంథా ముంచేసింది.. రైతన్నను ఆదుకోండి

మోంథా ముంచేసింది.. రైతన్నను ఆదుకోండి 2
2/2

మోంథా ముంచేసింది.. రైతన్నను ఆదుకోండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement