భూములు లాక్కోవద్దు
భోగాపురం:
ఇప్పటికే భోగాపురం విమానాశ్రయ నిర్మాణం కోసం వందల ఎకరాల భూములను అప్పగించామని, మళ్లీ అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో భూముల సేకరణ కోసం సర్వే చేయడం అన్యాయమంటూ గూడెపువలస సర్పంచ్ మట్టా అయ్యప్ప, కొల్లు రామ్మూర్తి, రైతులు ఆందోళన చేశారు. విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎమ్‌ఎన్ హరేంద్ర ప్రసాద్ ఆదేశాల మేరకు వీఎమ్‌ఆర్‌డీఏ సర్వేయర్ ఖాజాబాబా గూడెపువలస రెవెన్యూ పరిధిలో వీఆర్వో వాగ్దేవితో కలిసి గురు వారం చేపట్టిన సర్వేను అడ్డుకున్నారు. ఎడ్యుకేషన్ డెవలప్ మెంట్, ఐటీ పార్కుల ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణ కోసం భూములను సర్వే చేస్తున్నామని సర్వే సిబ్బంది చెప్పినా ససేమిరా అనడంతో సర్వేను నిలిపివేసి వెళ్లిపోయారు.


