సహిత విద్యావిధానంపై అవగాహన
విజయనగరం అర్బన్: జిల్లా కేంద్రంలోని డీఆర్‌డీఏ ఆడిటోరియంలో జిల్లా సమగ్ర శిక్ష, విద్యాశాఖ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖాధికారులకు సహిత విద్యావిధానంపై గురువారం ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సంసదర్భంగా డీఈఓ యు.మాణిక్యంనాయుడు, సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ ఎ.రామారావు మాట్లాడుతూ సహిత విద్యా వ్యవస్థను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలన్నారు. సాధారణ విద్యార్థులతో పాటు ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు కలిసి చదువుకోవడమే సహిత విద్యావిధానం లక్ష్యమన్నారు. రిసోర్స్ పర్సన్లు సునీల్, రామునాయుడు 21 రకాల వికలాంగత్వాలు, సహిత విద్యావిధానాలు, సమగ్రశిక్ష ప్రాజెక్టు ద్వారా ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు అందుతున్న సేవలు, ప్రశస్త యాప్, డిజిటల్ విద్యావిధానం, తదితర విషయాలను వివరించారు. కార్యక్రమంలో జిల్లా సహితవిద్య కోఆర్డినేటర్ ఎస్.సూర్యారావు, సహ కోర్డినేటర్ ఎం.భారతి పాల్గొన్నారు.


