దివ్యాంగులకు మళ్లీ వైద్య పరీక్షలు! | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగులకు మళ్లీ వైద్య పరీక్షలు!

Oct 19 2025 6:05 AM | Updated on Oct 19 2025 6:05 AM

దివ్యాంగులకు మళ్లీ వైద్య పరీక్షలు!

దివ్యాంగులకు మళ్లీ వైద్య పరీక్షలు!

దివ్యాంగులకు మళ్లీ వైద్య పరీక్షలు!

విజయనగరం ఫోర్ట్‌: ఏళ్ల తరబడి పింఛన్‌ పొందుతున్న దివ్యాంగులకు కూటమి సర్కార్‌ అఽధికారంలోకి రాగానే పెద్ద షాక్‌ ఇచ్చింది. దివ్యాంగ పింఛన్‌ పొందుతున్న ప్రతీ దివ్యాంగుడు రీ అసెస్‌మెంట్‌ చేయించుకోవాలని కూటమి సర్కార్‌ నోటీసులు అందించింది. సచివాలయాల పరిధిలో వెల్ఫేర్‌ అసిస్టెంట్ల ద్వారా వారికి ఏ ఆస్పత్రికి ఏ సమయానికి వెళ్లాలి అనే దానిపై నోటీసులు ఇచ్చింది. 2025 జనవరి నెలలో రీ అసెస్‌మెంట్‌ కార్యక్రమం వైద్య విధాన్‌ పరిషత్‌, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రుల్లో ఆగస్టు నెల వరకు నిర్వహించారు. పింఛన్‌ పునః పరిశీలన మాత్రమే, ఏ ఒక్క దివ్యాంగుడి పింఛన్‌ తొలగించబోమని అప్పట్లో కూటమి ప్రజాప్రతినిధులు తెలిపారు.

ఆగస్టు నెలలో పింఛన్లు తొలగిస్తామని

నోటీసులు

ఆగస్టు నెలలో రీ అసెస్‌మెంట్‌ 40 శాతం కంటే తక్కువ వైకల్యం ఉందని చెప్పి జిల్లాలో వేలాది మంది దివ్యాంగులకు నోటీసులు ఇచ్చారు. దీంతో తమకు అర్హత ఉందని చెిప్పి జిల్లాలో 5,159 మంది దివ్యాంగులు మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు.

మళ్లీ పరీక్షలు..

దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులకు మళ్లీ వైద్యులు పరీక్షలు చేయనున్నారు. నాలుగు వైద్య విధాన్‌ పరిషత్‌, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రుల్లో ఈ పరీక్షలు చేయనున్నారు. ఈ మేరకు దివ్యాంగులకు సచివాలయం ఉద్యోగులు నోటీసులు కూడా అందించారు. ఎస్‌.కోట ఏరియా ఆస్పత్రి, గజపతినగరం ఏరియా ఆస్పత్రి, చీపురుపల్లి ఏరియా ఆస్పత్రి, రాజాం ఏరియా ఆస్పత్రి, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రుల్లో దివ్యాంగులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆర్థో విభాగానికి చెందిన దివ్యాంగులు 3600 మందికి, కంటికి సంబంధించి దివ్యాంగులు 1038మందికి, చెవుడు, మూగకు సంబంధించిన దివ్యాంగులు 465మందికి, మెంటల్‌ డిజార్డర్‌కు సంబంధించి దివ్యాంగులు 42 మందికి, మెంటల్‌ ఇల్‌నెస్‌కు సంబంధించిన దివ్యాంగులు 14 మందికి పరీక్షలు చేయనున్నారు.

పింఛన్లు తొలగించేందుకే..

దివ్యాంగులకు ఇచ్చే పింఛన్‌ రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచుతున్నట్టు కూటమి సర్కార్‌ గొప్పలు చెప్పింది. ఈ చేత్తో ఇచ్చినట్టే ఇచ్చి ఆ చేత్తో లాగేసికొన్నట్టు కూటమి సర్కార్‌ దివ్యాంగులకు పింఛన్‌ పెంచి ఆ భారాన్ని తగ్గించుకునే కుట్ర చేస్తుందని దివ్యాంగులు ఆరోపిస్తున్నారు. పింఛన్‌ పెంచడం వల్ల కోట్లాది రుపాయిల భారం పడుతుందనే దురుద్దేశంతో కూటమి సర్కార్‌ పింఛన్‌ తొలగించడానికే దివ్యాంగులకు రీ అసెస్‌మెంట్‌ పేరుతో పరీక్షలు చేయిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఆందోళనకు గురవుతున్న దివ్యాంగులు

5,159 మందికి వైకల్య పరీక్షలకు మళ్లీ రావాలని నోటీసులు

ఏపీవీపీ, జీజీహెచ్‌లో పరీక్షలు చేయనున్న వైద్యులు

ఫించను తొలగిస్తామని ఆగస్టులో

నోటీసులు ఇచ్చిన కూటమి సర్కార్‌

మాకు అర్హత ఉందని దరఖాస్తు

చేసుకున్న దివ్యాంగులు

వైకల్య పరీక్షలు

దివ్యాంగ పింఛన్‌కు తమకు అర్హత ఉందని జిల్లాలో 5,159 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికి సచివాలయాల ద్వారా ఏ ఆస్పత్రికి, ఏ సమయానికి వెళ్లాలో నోటీసులు వెళ్లాయి. ఆయా ఆస్పత్రుల్లో వైద్యులు దివ్యాంగులకు పరీ క్షలు చేసి సర్టిఫికెట్స్‌ అప్‌లోడ్‌ చేయనున్నారు.

–డాక్టర్‌ ఎన్‌.పద్మశ్రీరాణి, జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement